📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే

Latest News: Thalapathy Vijay సుప్రీంకోర్టులో పరువు హత్యలపై పిటిషన్‌ వేసిన టీవీకే పార్టీ

Author Icon By Anusha
Updated: August 29, 2025 • 12:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళ సినీ స్టార్ హీరో విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ (TVK Party) తాజాగా ఓ కీలక సామాజిక అంశంపై సుప్రీంకోర్టు తలుపు తట్టింది.రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న పరువు హత్యలు సమాజానికి ముప్పు కలిగిస్తున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రత్యేక చట్టం అవసరమని పేర్కొంటూ టీవీకే పిటిషన్‌ దాఖలు చేసింది.ఇటీవల తమిళనాడులో ఓ దళిత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్యకు గురైన నేపథ్యంలో టీవీకే ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.వివరాల్లోకి వెళితే, జులై 27న తిరునల్వేలిలో ఐటీ ఉద్యోగి కవిన్ సెల్వగణేషన్ పరువు హత్య (Honor killing) కు గురయ్యారు. వేరొక సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించడమే ఆయన హత్యకు దారితీసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, యువతి సోదరుడు సుర్జిత్, తండ్రి శరవణన్‌ను అరెస్టు చేశారు. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Latest News

తాము నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సి వచ్చిందని

ఈ నేపథ్యంలో బాధితుడికి న్యాయం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చూడాలని టీవీకే తన పిటిషన్‌లో పేర్కొంది.నిజానికి, పరువు హత్యలపై కఠినమైన చట్టాలు తీసుకురావాలని తమిళనాడులోని పలు రాజకీయ పక్షాలు చాలాకాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే తాము నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సి వచ్చిందని టీవీకే వర్గాలు స్పష్టం చేశాయి. ఈ పిటిషన్ ద్వారా పరువు హత్యల బాధితులకు న్యాయం జరగడంతో పాటు, ఇలాంటి దురాచారాలకు వ్యతిరేకంగా ఒక పటిష్ఠమైన చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని పార్టీ కోరుతోంది

Read hindi news: https://hindi.vaartha.com/

Read Also:

https://vaartha.com/telugu-news-trumps-approach-to-america-india-is-not-right-richard-wolf/international/537604/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.