📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Supreme Court: స్వేచ్ఛ కావాలంటే పెళ్ళికి దూరంగా ఉండండి

Author Icon By Anusha
Updated: August 22, 2025 • 10:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వివాహ బంధం అంటే కేవలం ఒక ఆచారం, ఒక వేడుక మాత్రమే కాదు. అది జీవితాంతం ఇద్దరిని ఒకే గూటిలో కట్టిపడేసే బంధం. భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన, మానసిక ఆధారం, భావోద్వేగ సహకారం అన్నీ కలిసినపుడే ఆ బంధం బలంగా నిలుస్తుంది. తాజాగా భార్యాభర్తల బంధం, విడాకులు, పిల్లల సంరక్షణ వంటి అంశాలపై విచారణ జరుగుతున్న ఒక కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.ఇద్దరు పిల్లలున్న ఒక జంట విడాకుల కోసం కోర్టు (Supreme Court) ను ఆశ్రయించింది. భార్య తన వాదనలో.. “నేను నా భర్తపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నాను” అని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలంటే పెళ్లే చేసుకోకూడదు” అని స్పష్టంగా పేర్కొన్నారు.

ఎవరిపై ఆధార పడకుండా జీవించాలని

ఈ కేసులో భార్యాభర్తలు ఇద్దరు కూడా విద్యావంతులు, స్థిరపడినవారు. భర్త సింగపూర్‌లో పని చేస్తుండగా.. భార్య హైదరాబాద్ (Hyderabad) నుంచి విచారణలో వర్చువల్‌గా పాల్గొన్నారు. ముఖ్యంగా భార్య.. తన భర్తతో కలిసుండాలని లేదని చెప్పింది. గతంలో అతడితోపాటు సింగపూర్ వెళ్తే.. తమను సరిగ్గా చూసుకోలేదని వాపోయింది. డబ్బుల విషయంలో గొడవలు జరిగినట్లు వివరించింది. అందుకే తాను ఎవరిపై ఆధార పడకుండా జీవించాలని నిర్ణయించుకున్నట్లు వివరించింది. కానీ న్యాయస్థానం మాత్రం.. విడాకులు తీసుకోకుండా ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలని కోర్టు దంపతులకు సూచించింది. “పిల్లలు విచ్ఛిన్నమైన కుటుంబాన్ని చూడకూడదు” అని న్యాయమూర్తులు తీవ్ర భావోద్వేగంతో పేర్కొన్నారు.విడాకుల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసి.. రాజీ పడేందుకు ప్రయత్నించాలని చెప్పారు.

Latest News

పిల్లల భవిష్యత్తు

భార్య, పిల్లల నిర్వహణ ఖర్చుల కోసం భర్త రూ. 5 లక్షలు జమ చేయాలని.. అలాగే వారాంతాల్లో పిల్లలను తన వద్దకు తీసుకెళ్లాలని కోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణలో భర్త రాజీకి సిద్ధమని చెప్పగా.. భార్య మాత్రం విముఖత చూపినట్లు తెలుస్తోంది.ఈ మొత్తం వ్యవహారం వివాహ వ్యవస్థపై సుప్రీం కోర్టుకున్న సంప్రదాయ వైఖరిని మరోసారి బయటపెట్టింది. వివాహ బంధాన్ని కాపాడటం, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే కోర్టు ప్రధాన లక్ష్యమని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

సుప్రీంకోర్టు ఎప్పుడు స్థాపించబడింది?

భారత సుప్రీంకోర్టు 1950, జనవరి 26న స్థాపించబడింది. అదే రోజు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఏమని పిలుస్తారు?

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని “చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా” (CJI) అని పిలుస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/change-in-numbers-of-south-central-railway-passenger-trains/national/534144/

Breaking News child custody complete freedom Divorce case Justice BV Nagarathna Justice R Mahadevan latest news marriage bond Supreme Court Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.