2019లో జారీ చేసిన మసాలా బాండ్ల కేసులో కేరళ సీఎం పినరయి విజయన్(Pinarayi Vijayan)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) నోటీసులు పంపింది. సీఎంతో పాటు ఆయన చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎం అబ్రహం, రాష్ట్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి థామస్ ఇస్సాక్‌లకు కూడా విచారణ నోటీసులు అందాయి.
Read Also: Jayaprakash Narayana: స్కిల్ లేకుండా పట్టాలు ఉండి ఏం లాభం
రూ.468 కోట్ల విలువైన ఆర్థిక లావాదేవీల్లో ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (Foreign Exchange Management Act) నిబంధనలు ఉల్లంఘించారనే అనుమానాలపై వివరణ కోరింది. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిధులను సమీకరించే ప్రయత్నంలో భాగంగా ఈ మసాలా బాండ్లు విడుదల చేసినట్లు తెలిసిందే.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: