📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

Latest News: Jitu Patwari – మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ఇంట్లో దొంగల బీభత్సం..

Author Icon By Anusha
Updated: September 7, 2025 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన ఘటన తాజాగా వెలుగుచూసింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జీతూ పట్వారీ (State Congress Party President Jitu Patwari) ఇంట్లో భారీ చోరీ జరగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇండోర్‌లోని రాజేంద్రనగర్ పరిధి బిజల్‌పూర్ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఆరుగురికి పైగా దొంగలు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. శుక్రవారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.చోరులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మొదటగా ఆ ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

ఆ తర్వాత బయట ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి.. లోపలికి ప్రవేశించినట్లు ఎవరికీ తెలియకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం ఇంట్లో ఉన్న కార్యాలయంలోకి వెళ్లి అక్కడి డ్రాలు, లాకర్లను పగలగొట్టారు. అయితే ఈ చోరీ వెనుక ఉన్న ఉద్దేశంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దొంగలు ఇంట్లో ఉన్న మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను వదిలి పెట్టి.. కొన్ని సాధారణ వస్తువులను మాత్రమే తీసుకువెళ్లారు.

దొంగలు ఏవైనా ముఖ్యమైన పత్రాల కోసం

దీంతో కుటుంబ సభ్యులు సహా పోలీసులు అంతా షాక్ అవుతున్నారు. దీన్ని బట్టే ఇది సాధారణ చోరీ కాదనీ.. దీని వెనుక ఏదైనా పగ, రాజకీయ కుట్ర ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దొంగలు ఏవైనా ముఖ్యమైన పత్రాల కోసం వెతికి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇదే దొంగల ముఠా జీతూ పట్వారీ (Jitu Patwari) ఇంటితో పాటు సమీపంలో నివసిస్తున్న చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ (సీఎంఓ) రాజ్ కుమార్ ఠాకూర్, మధ్య ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (ఎంపీఈబీ) ఆఫీసర్ నరేంద్ర దూబే ఇళ్లలో కూడా చొరబడ్డారు. అక్కడ కూడా విలువైన వస్తువులు వదిలేసి సాధారణ వస్తువులను మాత్రమే దొంగిలించారు.

Latest News

ఈ ఘటనపై కేసు నమోదు

దాదాపు రెండున్నర గంటల పాటు ఆ ప్రాంతంలో దొంగలు హల్‌చల్ చేశారు. ఈ దొంగలు మాస్కులు ధరించి ఉన్నప్పటికీ.. పట్వారీ ఇంటి వెలుపల ఉన్న సీసీ కెమెరాల్లో వారి కదలికలు రికార్డయ్యాయి.ఈ ఘటనతో బిజల్‌పూర్‌లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారుల ఇళ్లే సురక్షితం కానప్పుడు.. సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల ముఠాను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ అనుమానాస్పద చోరీ కేసులో అసలు నిజాలు బయటపడాలంటే.. కొంత కాలం ఆగాల్సిందే.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-ashoka-chakra-union-minister-giriraj-singh-criticizes-rahul-gandhi/national/542766/

bijalpur colony theft Breaking News congress pcc chief robbery indore burglary jeetu patwari house robbery latest news madhya pradesh congress rajendra nagar crime Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.