అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా భారత్ – అమెరికా సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. భారత్, అమెరికా మధ్య ఉన్న బంధం “చాలా ప్రత్యేకమైనది” అని ఆయన స్పష్టం చేశారు. తాను, భారత ప్రధాని నరేంద్ర మోదీ మంచి స్నేహితులమని, రెండు దేశాల సంబంధాల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ (Modi) సానుకూలంగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు వ్యక్తపరిచిన మనోభావాలను తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని, ఆయనకు పూర్తి మద్దతు ఇస్తున్నానని మోదీ తెలిపారు. “భారత్ – అమెరికా సంబంధాలపై ట్రంప్ చూపుతున్న సానుకూల దృక్పథం ప్రశంసనీయం. ఇరు దేశాలు విశ్వాసం, సహకారం, దూరదృష్టి ఆధారంగా ఒక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి” అని ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
భారత్ – అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం
ట్రంప్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌ను ప్రశ్నించగా..”చెప్పడానికి ఏమీ లేదు” అన్నారు.మరోవైపు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరోసారి భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.. భారత్ నిజాన్ని అంగీకరించదని, సమస్యను వక్రీకరిస్తోందని పీటర్ నవారో అన్నారు.భారత్‌లో రష్యన్ ఆయిల్ ద్వారా ‘బ్రాహ్మణులు’ లాభాలు ఆర్జిస్తున్నారని ఈ ప్రకటనకు ముందు నవారో ఆరోపించారు. పీటర్ నవారో వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
Read hindi news : hindi.vaartha.com
Read also: