ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య(Ayodhya )లో రామమందిర నిర్మాణానంతరం అక్కడి భూవ్యవస్థలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. రామజన్మభూమి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో భూముల ధరలు వేగంగా పెరిగాయి. అధికారులు అందించిన సమాచారం ప్రకారం, ఆలయానికి సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో భూముల ధరలు 30% నుండి 200% వరకు పెరిగినట్టు తెలిసింది.
ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లో భూముల రేట్లకు రెక్కలు
అయోధ్యలో రకాబ్ గంజ్, దేవకాళి, అవధ్ విహార్ వంటి ప్రాంతాల్లో భూముల ధరలు అత్యంత వేగంగా పెరిగాయి. ఈ ప్రాంతాల్లో భూ అభివృద్ధి, రహదారి వసతులు, రామమందిర ప్రాజెక్ట్‌కు దగ్గరగా ఉండటం వల్ల భూక్రమం వేగంగా మారిందని రియల్ ఎస్టేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆలయం ప్రాంగణానికి చేరువగా చదరపు మీటర్ ధర రూ.26,000 నుంచి రూ.27,000 వరకు ఉండడం గమనార్హం.
పర్యాటక ప్రోత్సాహంతో పెరుగుతున్న పెట్టుబడులు
రామమందిరం వద్ద జరిగే విశాలమైన అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరియు విదేశాల నుండి కూడా పర్యాటకులు, పెట్టుబడిదారులు అయోధ్య వైపు చూపు పెంచుతున్నారు. హోటళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, నివాస ప్రాజెక్టులు నిర్మాణం కొనసాగుతుండటంతో భూములపై డిమాండ్ మరింత పెరిగింది. దీంతో భవిష్యత్‌లో అయోధ్య దేశంలోని ప్రధాన పెట్టుబడి కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also : NTR Trust : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్