📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!

Author Icon By Ramya
Updated: July 18, 2025 • 2:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది

ల్యాండ్ ఫర్ జాబ్స్ (Land for Jobs) కేసులో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు (Lalu Prasad Yadav) సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ హైకోర్టు (High Court) తన పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ లాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ కేసులో ట్రయల్ కోర్టు కార్యకలాపాలపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అంతేకాకుండా, ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. లాలూ యాదవ్ 2004 నుంచి 2009 వరకు రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం జరిగినట్టు ఆరోపణలున్నాయి. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో ఉన్న వెస్ట్ సెంట్రల్ జోన్ ఆఫ్ ఇండియన్ రైల్వేలో గ్రూప్ డి నియామకాల సమయంలో లాలూ ఈ కుంభకోణానికి తెరతీసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనతోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఆయన భార్య, వారి ఇద్దరు కుమార్తెలు, మరో అధికారి కూడా ఉన్నారు.

లాలూ యాదవ్ (Lalu Prasad Yadav) తన పిటిషన్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) 2022, 2023, 2024లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) దాఖలు చేసిందని, కుంభకోణం జరిగినట్టుగా చెబుతున్న 14 సంవత్సరాల తర్వాత కేసు నమోదైందని పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టు మే 29న ఈ కేసును విచారిస్తూ కార్యకలాపాలను నిలిపివేయడానికి ఎటువంటి బలవంతపు కారణాలు లేవని స్పష్టం చేసింది. అయితే, ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ లాలూ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐకి నోటీసు జారీ చేసింది. ఈ కేసు విచారణ ఆగస్టు 12న జరగనుంది.

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో సుప్రీంకోర్టు లాలూ ప్రసాద్ పిటిషన్‌పై ఏమి తీర్పు చెప్పింది?

ట్రయల్ కోర్టు కార్యకలాపాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఉన్న ప్రధాన ఆరోపణలు ఏమిటి?

రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ డి ఉద్యోగాలకు భూములుగా తీసుకొని నియామకాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also: Bhupesh Baghel: లిక్క‌ర్ స్కామ్‌.. మాజీ సీఎం భూపేశ్ భగేల్ ఇంట్లో ఈడీ దాడులు

Bihar Politics Breaking News cbi investigation lalu prasad yadav Land for Jobs Scam latest news RJD Supreme Court Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.