📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Crime: లేడీ కానిస్టేబుల్ పై పోలీస్ లైంగిక వేధింపులు

Author Icon By Sharanya
Updated: August 2, 2025 • 1:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Crime: లేడీ కానిస్టేబుల్ పై ఓ పోలీసే లైంగిక వేధింపులకు గురిచేస్తే ఆమె ఎవరికి చెప్పుకోవాలి? అంతటితో ఆగక ఆ మోసగాడు మూడుసార్లు ఆమెకు అబార్షన్ చేయించాడు. రక్షించాల్సిన పోలీసులే కంచె చేనుమేస్తే ఏం చేయాలి? ఆ బాధితురాలు మాత్రం ధైర్యంగా తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Crime: లేడీ కానిస్టేబుల్ పై పోలీస్ లైంగిక వేధింపులు

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం

బాధిత మహిళ బక్సార్ జిల్లా (Buxar District) లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నది. నిందితుడు గయా జిల్లాకు చెందిన కానిస్టేబుల్. ఇద్దరికి ఫిబ్రవరి 2023లో జరిగిన క్యాంపస్ లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆమె నంబర్ తీసుకుని ఫోన్లో తరచుగా మాట్లాడేవాడు. 2023 ఏప్రిల్లో బాధితురాలు వవారణాసికి వెళ్లినప్పుడు, నిందితుడు కూడా వచ్చాడు. అక్కడే ఓ హోటల్లో బాధితురాలితో బలవంతంగా శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఈ విషయంపై ఎదురుతిరగడంతో ఆమెను బతిమిలాడు. తన ఉద్యోగం పోతుందని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని ఆమెను క్షమాపణలు కోరాడు.

రహస్యంగా పెళ్లి

2023 మేలో బాధితురాలు గర్భం దాల్చింది. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు నిందితుడు, ఎవరికీ తెలియకుండా ఆమెను జార్ఖండ్ (Jharkhand)లోని దేవగఢ్ దేవాలయంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు వేర్వేరుగా ఉండేవారు. ఆ తర్వాత నిందితుడి కుటుంబ సభ్యులను కలవాలని మహిళ కానిస్టేబుల్ అడిగినా, పలు కారణాలు చెప్పి వాయిదా వేసేవాడు. త్వరలోనే తన కుటుంబానికి పరిచయం చేస్తానని చెప్పి మందులు ఇచ్చి గర్భాన్ని తొలగించాడు. అలా రెండేళ్లల్లో మూడుసార్లు గర్భం దాల్చింది. ప్రతిసారి ఏదొక కారణం చెప్పి దానిని తొలగించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే 2025మేలో నిందితుడు మరో మహిళను పెళ్లి చేసుకున్న విషయం తెలియడంతో బాధితురాలు మోసపోయినట్లు తెలుసుకుని
పోలీసులను ఆశ్రయించింది.

నిందితుడిని సస్పెండ్చేసిన అధికారులు

కాగా బాధిత మహిళ ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు డుమ్రాన్ పోలీసులు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిన వేధింపులకు గురిచేసినట్లు కేసును నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని, ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/street-dogs-protection-of-street-dogs-from-the-hardships-of-the-rains/hyderabad/524775/

Breaking News Crime News Lady Constable latest news Police Abuse Police Misconduct Sexual Harassment Telugu News women safety

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.