Ladakh: కేంద్ర పాలిత ప్రాంతం లఢఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) కవీందర్ గుప్తా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన, అధికారికంగా ప్రకటించారు. లఢఖ్ మూడవ ఎల్జీగా 2025, జూలై 18న బాధ్యతలు చేపట్టిన ఆయన, కేవలం ఎనిమిది నెలల స్వల్ప కాలంలోనే పదవి నుంచి తప్పుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: Sukhoi Su-30: అస్సాంలో సుఖోయ్-30 యుద్ధ విమానం అదృశ్యం!
రాజకీయ నేపథ్యం!
66 ఏళ్ల కవీందర్ గుప్తా చిన్ననాటి నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. 13 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్ లో చేరిన ఆయన, ఎమర్జెన్సీ సమయంలో 13 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. 2005 నుంచి 2010 వరకు రికార్డు స్థాయిలో మూడు పర్యాయాలు జమ్ము మేయర్ గా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి గెలుపొంది, 2015లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి స్పీకర్ అయిన తొలి బీజేపీ నేతగా గుర్తింపు పొందారు.
2018 ఏప్రిల్ లో జమ్ముకశ్మీర్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన గుప్తా, అప్పట్లో బీజేపీ-పీడీపీ కూటమి విచ్ఛిన్నం కావడంతో కేవలం 51 రోజులకే ఆ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2025 జూలైలో లఢఖ్ ఎల్జీగా నియమితులయ్యారు. తాజా పరిణామాలతో ఆయన మరోసారి స్వల్ప కాలంలోనే పదవిని వీడాల్సి వచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: