రాష్ట్రహోదా కోరుతూ లడఖ్ లో బుధవారం చేపట్టిన నిరసనలు కాస్త హింసాత్మకంగా మారాయి. పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు. దీంతో పోలీసులు, ఆందోళనకారులు మధ్య జరిగిన గొడవలో పోలీసు వాహనానికి నిరసనకారులు నిప్పంటించారు. వందలాదిగా లేహ్ సిటీ వీధుల్లోకి(streets of Leh city) వచ్చిన ప్రజలు రాష్ట్రహోదా.. రాజ్యాంగభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. బుధవారం పూర్తిస్థాయి బంద్ కు పిలుపునిచ్చిన లడఖ్ వాసులు గతకొంతకాలంగా నిరాహార దీక్షలు చేపట్టారు. అంతేకాక బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వి, వారి వాహనాన్ని తగులబెట్టారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీఛార్జ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Telugu News:Dilsukhnagar: నిరుద్యోగుల ఆందోళన – జాబ్ క్యాలెండర్ విడుదల డిమాండ్
మూడేళ్లుగా కొనసాగుతున్న ఆందోళనలు
గతమూడేళ్ల నుంచి కేంద్ర పాలనకు వ్యతిరేకంగా లడఖ్ ప్రజలు రోడ్లపైకి వచ్చి రాష్ట్రహోదా కల్పించాలని కోరుతున్నారు. తమ భూభాగం, సంస్కృతి, వనరులకు రాజ్యాంగపరమైన రక్షణ(Constitutional protection) కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో లడఖ్ ప్రతినిధులను అక్టోబరు 6న సమావేశానికి ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం. ఆ రాష్ట్రం ఏర్పాటుకు ప్రజల డిమాండ్పై చర్చలను పునఃప్రారంభనుంది.
లడఖ్‌లో ఏ సంఘటన జరిగింది?
లడఖ్‌లో పోలీస్ వాహనానికి నిప్పుపెట్టే ఘటన జరిగింది.
ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుంది?
లడఖ్ ప్రాంతంలో ఉంది.