KSRTC Bus Conductor: బస్సులో నిద్రపోతున్న యువతిని లైంగికంగా వేధించిన కండక్టర్

Read Time:  1 min
KSRTC bus conductor arrest
KSRTC bus conductor arrest
FONT SIZE
GET APP

మంగళూరు నగరంలో కదులుతున్న బస్సులో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో కండక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వ్యక్తిని ప్రదీప్ కశప్ప నాయక్‌గా గుర్తించారు. ముడిపు నుంచి నగరానికి వస్తున్న బస్సులో ఈ ఘటన జరిగింది. ప్రయాణికుల్లో ఒకరు ఈ ఘటనను వీడియోగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పోలీసులు స్పందించారు. వీడియోలో మహిళ నిద్రలో ఉండగా, కండక్టర్ ఆమెకు దగ్గరగా నిల్చొని, ఆమె శరీరంపై అశ్లీలంగా చేయి వేసినట్లు స్పష్టంగా కనిపించింది.

ఈ వీడియో ఆధారంగా బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రదీప్‌పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 74 (మహిళపై దాడి లేదా అశ్లీలంగా ప్రవర్తించడం) మరియు సెక్షన్ 75 (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి, 15 రోజుల న్యాయహిరాసతకు పంపించారు. ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకొని అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.

కెఎస్‌ఆర్‌టీసీ విభాగం ఈ ఘటనపై స్పందించి, ప్రదీప్ నాయక్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. డిసిప్లినరీ విచారణ పూర్తయ్యే వరకు ఆయన సేవలను నిలిపివేసినట్లు తెలిపారు. రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఈ విషయంపై కెఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాస్తూ, విచారణను త్వరగా పూర్తి చేసి బాధితుడిని ఉద్యోగం నుంచి తొలగించాలని సూచించారు. “ప్రయాణికులకు కెఎస్‌ఆర్‌టీసీ సిబ్బంది పట్ల గౌరవం ఉంటుంది. కొంతమంది తప్పుదారులు పడటంతో సంస్థ ప్రతిష్ఠకు భంగం కలుగుతోంది” అని మంత్రి పేర్కొన్నారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.