KP Unnikrishnan: భారత రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేపీ ఉన్నికృష్ణన్ (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, కోజికోడ్ (Kozhikode)లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య అమృత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేరళ రాజకీయ చరిత్రలో ఒకే లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా అత్యధిక కాలం ప్రాతినిధ్యం వహించిన నాయకుడిగా ఉన్నికృష్ణన్కు గుర్తింపు పొందారు.
Read Also: Telugu States Weather: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
కేంద్ర మంత్రిగా సేవలందించిన ఉన్నికృష్ణన్
జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఉన్నికృష్ణన్ రాజకీయాల్లోకి ప్రవేశించి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. 1971లో తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా వడకర నుంచి పార్లమెంటులో అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత 1977, 1980, 1984, 1989, 1991 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. వీపీ సింగ్ కేబినెట్లో ఉపరితల రవాణా, కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేశారు.
ఉన్నికృష్ణన్ ఇందిరా గాంధీకి నమ్మకస్తుడైన అనుచరుడిగా ఉన్నప్పటికీ, సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం కాంగ్రెస్ (యూ), కాంగ్రెస్ (ఎస్) పార్టీల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1981-84 మధ్య కాలంలో పార్లమెంటులో కాంగ్రెస్ (సెక్యులర్) పక్ష నేతగా, 1980-82లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. సుదీర్ఘ విరామం తర్వాత 1995 లో తిరిగి సొంతగూడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: