Kochi Tragedy: కొచ్చిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి!

Read Time:  1 min
Kochi Tragedy
Kochi Tragedy
FONT SIZE
GET APP

Kochi Tragedy: కేరళలోని కొచ్చిలో అత్యంత విషాదకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు అద్దె ఇంట్లో విగతజీవులుగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. మరణించిన వారిలో ముగ్గురు చిన్న పిల్లలు ఉండటం అందరినీ కలిచివేస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, వీరు సామూహిక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read Also :Godavari Drowning Incident: గోదావరి ఘటన.. చావు లోను వీడని స్నేహం

Kochi Tragedy

Kochi Tragedy: ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లుల బలవన్మరణం

మృతులను 58 ఏళ్ల శ్రీకుమారి, ఆమె కుమార్తె 36 ఏళ్ల అశ్వతి నాయర్‌తో పాటు వారి ముగ్గురు పిల్లలుగా గుర్తించారు. వీరంతా అసలు తిరువనంతపురానికి చెందినవారని, కేవలం వైద్య చికిత్స నిమిత్తం కొచ్చికి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారని తెలిసింది. ఫిబ్రవరి నెల నుండి వడుతల ప్రాంతంలోని ఒక అద్దె ఇంట్లో వీరు ఉంటున్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఇద్దరు మహిళలు ముందుగా పిల్లలకు విషం ఇచ్చి, ఆ తర్వాత తాము కూడా ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ సామూహిక ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.