📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

KN Rajanna : మంత్రి పదవికి కేఎన్‌ రాజన్న రాజీనామా!

Author Icon By Sudha
Updated: August 11, 2025 • 3:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్నాటక సహకార మంత్రి, ముఖ్యమంత్రి మద్దతుదారుడైన కేఎన్‌ రాజన్న(KN Rajanna) తన పదవికి రాజీనామా (resignation) చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమర్పించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మద్దదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓట్ల చోరీ అంశంపై సొంత పార్టీపై ఆయన విమర్శలు గుప్పించడంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. గతవారంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్‌ గాంధీ బెంగళూరులో ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరిస్తోందని.. బెంగళూరు సెంట్రల్‌ వంటి కీలక నియోజకవర్గాల్లో పార్టీ ఓటమికి ఓట్ల చోరీయే కారణమని ఆరోపించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజన్న (KN Rajanna) కీలక వ్యాఖ్యలు చేశారు.

KN Rajanna : మంత్రి పదవికి కేఎన్‌ రాజన్న రాజీనామా!

మన సొంత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓటర్ల జాబితాలను సవరించారని గుర్తుంచుకోవాలని.. ఆ సమయంలో పార్టీ ఎందుకు కళ్లు మూసుకుందని ఆయన ప్రశ్నించారు. అక్రమాలు జరుగుతున్నాయన్నది నిజమే, కానీ, అన ముక్కు కిందనే జరిగిందనేది మనకు అవమానకరం అన్నారు. ఓటర్ల జాబితా వంటి అంశాలపై సకాలంలో చర్యలు తీసుకోవడం మన బాధ్యత అవుతుందని రాజన్న(KN Rajanna) వ్యాఖ్యానించారు. ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించిన తర్వాత ఈసీఐ అభ్యంతరాలను ఆహ్వానించిందన్న విషయాన్ని ఆయన ఎత్తి చూపారు. పలువురు రాజన్న వ్యాఖ్యలను స్వాగతించగా.. మరికొందరు సీనియర్లు పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజన్న వ్యాఖ్యలపై డీకే వర్గీయులు మండిపడ్డారు. ఆయన పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే కర్నాటక కాంగ్రెస్‌లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మద్దతుదారుల మధ్య సీఎం పదవి విషయంలో అంతర్గత విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.

కె ఎన్ రాజన్న జీవిత చరిత్ర

భారత జాతీయ కాంగ్రెస్ క్యాతసంద్ర తాలూకా విభాగానికి కార్యదర్శిగా పనిచేసిన కాలంలోనే ఆయన ప్రజా జీవితం ప్రారంభమైంది. 1976లో, క్యాతసంద్ర నగర పంచాయతీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, 1980 మరియు 1984 మధ్య తుమకూరు జిల్లా-యూనిట్‌లో INC యువజన కాంగ్రెస్ విభాగానికి నాయకత్వం వహించారు.

కె ఎన్ రాజన్న పుట్టిన తేదీ

క్యాతసంద్ర ఎన్. రాజన్న (జననం 13 ఏప్రిల్ 1951) కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆయన రెండవ సిద్ధరామయ్య మంత్రివర్గంలో సహకార మంత్రిగా పనిచేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/rahul-gandhi-leaders-arrested/national/528939/

Breaking News Congress leader Karnataka politics KN Rajanna latest news Minister Resignation Political News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.