📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Telugu News: Kiren Rijiju: పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

Author Icon By Sushmitha
Updated: December 15, 2025 • 4:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రభుత్వం అన్నాక ప్రతిపక్షాలు ఉంటాయి. అధికారపార్టీలతో పాటు ప్రతిపక్షాలు రెండూ ఉంటేనే ప్రజల సమస్యలపై పోరాటం సాగుతుంది. కానీ నేటి అధికార, ప్రతిపక్షాలు ప్రజల పక్షాన పోరాడాల్సింది పోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్నారు. కొన్నిసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, నవ్వులపాలు అవుతున్నారు. ఒక దేశప్రధానికి సమాధి కడతామని కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.

Read Also: Delhi Pollution: దిల్లీలో పొగమంచు–కాలుష్య ముప్పు 50శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం

Kiren Rijiju Modi should apologize in both houses of Parliament.. Union Minister

దీనిపై అధికారపార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ప్రధాని మోదీ (Prime Minister Modi) ప్రాణాలకు హాని  తలపెడతామంటూ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరికలు చేసినందుకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Central Minister Kiren Rijiju) డిమాండ్ చేశారు.

నామమాత్రంగా ఖండిస్తే సరిపోదు..

ఆదివారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో కొందరు కార్యకర్తలు ప్రధానిమోదీ కోసం సమాధిని తవ్వుతామని బహిరంగంగా వ్యాఖ్యానించడం అత్యంత దురదృష్టకరం, విషాదకరమన్నారు. భారత ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావు లేదని ఆయన పేర్కొన్నారు. సోమవారం అత్యవసరంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. కార్యకర్తలు తప్పుడు చేష్టను కాంగ్రెస్ నేతలు నామమాత్రంగా ఖండించి వదిలేస్తే సరిపోదన్నారు.

దీనిపై పార్లమెంటు వేదికగా లోకసభ విపక్ష నేత రాహుల్, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. కాంగ్రెస్ నేతల్లో మానవత్వం మిగిలిఉంటే, దేశ ప్రజలపై గౌరవం ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పార్లమెంటు ఉభయసభల్లో క్షమాపణ చెబుతూ ప్రకటన చేయాలని కేంద్ర మంత్రి సూచించారు. విపక్ష నేతలను రాజకీయ ప్రత్యర్థులుగా చూస్తారే తప్ప, శత్రువులుగా చూడనని ప్రధాని మోదీ నిత్యం చెబుతుంటారని కిరణ్ రిజిజు గుర్తు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Apology to PM Modi in Parliament Google News in Telugu Kiren Rijiju demands apology Latest News in Telugu Modi government political news. Opposition disruption in Parliament Parliamentary proceedings controversy Political statements India Telugu News Today Union Minister on Parliament session

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.