భారత్‌లో వాయు కాలుష్యాన్ని తగ్గించాలంటే వ్యవస్థను సరిచేయాల్సిన అవసరం ఉందని మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ(Kiran Bedi) అన్నారు. గతంలో పుదుచ్చరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా చేసిన ఆమె తాజాగా కాలుష్య నియంత్రణకు అయిదు సంస్కరణలను చేపట్టాలని సూచించారు. కంటితుడుపు చర్యలకు కాలుష్యం ఏమీ మారదని, వ్యవస్థీకృత మార్పులు అవసరం అని ఆమె అన్నారు. దీని కోసం అధికారం, స్పష్టత కావాలన్నారు. ఫైవ్ రిఫార్మ్స్ ఇండియా నీడ్స్ ఫర్ క్లీన్ ఎయిర్ టైటిల్‌తో ఆమె తన బ్లాగ్‌లో ఓ వ్యాసాన్ని రాశారు. ఫైర్‌ఫైటింగ్ వ్యవస్థ నుంచి వ్యవస్థీకృత మార్పు దివగా ఇండియా అడుగులు వేయాలని ఆమె అన్నారు. వ్యవస్థను సరి చేస్తే, స్వచ్ఛమైన గాలి వీస్తుందన్నారు. స్వచ్ఛమైన గాలిని పీల్చే వ్యవస్థ రూపొందించే బలమైన వ్యవస్థ అవసరం ఉందన్నారు. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సంస్థకు నిజమైన అధికారం కావాలని కిరణ్ బేడీ (Kiran Bedi) పేర్కొన్నారు.రిటైర్డ్ అధికారులతో ఆ వ్యవస్థను నడపలేమన్నారు.
Read Also : http://West Bengal : రాత్రంతా వీధికుక్కల రక్షణలో పసికందు
రాష్ట్రాల్లో సెక్రటరీ స్థాయిలో పనిచేసిన వ్యక్తి అన్ని రాష్ట్రాలతో కలిసి మార్పును తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖలో సీఏక్యూఎంను కలపాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభావవంతంగా పనిచేయాలంటే ఆ సంస్థను జోడించాలన్నారు. అయిదేళ్ల కోసం క్లియర్ ఎయిర్ మిషన్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని స్థాయిల్లో క్లీన్ ఎయిర్ సెల్స్ అవసరం అని ఆమె అన్నారు. సీఏక్యూఎం తన ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌ను కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు.
కిరణ్ బేడీ ఎందుకు ప్రసిద్ధి చెందారు?
కిరణ్ బేడి (జననం జూన్ 9, 1949, అమృత్సర్, భారతదేశం) ఒక భారతీయ సామాజిక కార్యకర్త, ఆమె ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)లో చేరిన మొదటి మహిళ మరియు భారతదేశంలో జైలు సంస్కరణలను ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించింది. నలుగురు కుమార్తెలలో బేడి రెండవ వారు.
కిరణ్ బేడీ ఎందుకు రాజీనామా చేశారు?
2003లో, బేడి ఐక్యరాజ్యసమితి శాంతి కార్యకలాపాల విభాగంలో ఐక్యరాజ్యసమితి పోలీసు మరియు పోలీసు సలహాదారుగా నియమితులైన మొదటి భారతీయురాలు మరియు మొదటి మహిళ అయ్యారు. సామాజిక క్రియాశీలత మరియు రచనలపై దృష్టి పెట్టడానికి ఆమె 2007లో రాజీనామా చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :