Keralam State Name Change: కేరళ పేరును ‘కేరళమ్‌’ మార్పుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Read Time:  1 min
Keralam State Name Change: కేరళ పేరును ‘కేరళమ్‌’ మార్పుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
FONT SIZE
GET APP

Keralam State Name Change: దశాబ్దాల కాలంగా వినిపిస్తున్న విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా ‘కేరళమ్‌’ (Keralam) గా మారుస్తూ కేంద్ర క్యాబినెట్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకున్నట్టయ్యింది.మలయాళంలో ఈ రాష్ట్రాన్ని కేరళమ్‌ అని పిలుస్తారు. కానీ, 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు చేసినప్పుడు రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో కేరళగా నమోదు చేశారు. ఉచ్చారణ సౌలభ్యం కోసం బ్రిటిషర్లు మార్చిన ఈ పేరునే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కే

Read Also: Kerala High Court: కేరళ సీఎంఓపై హైకోర్టు సీరియస్

రాజ్యాంగ సవరణ

కేరళ రాష్ట్రాన్ని ‘కేరళమ్’గా మార్చుతూ జూన్ 24, 2024లో కేరళ అసెంబ్లీలో పినరయి విజయన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ప్రధాన మంత్రి నూతన కార్యాలయం ‘సేవా తీర్థ్’లో జరిగిన తొలి క్యాబినెట్‌ సమావేశంలో కేరళ రాష్ట్రం పేరును మార్పు ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.దీనికి ముందు కూడా కేరళ అసెంబ్లీ ఆగస్టు 2023లో తీర్మానం చేసి పంపగా.. కేంద్ర హోం శాఖ సాంకేతిక మార్పులకు సూచనలు చేసింది. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత సీఎం విజయన్ మాట్లాడుతూ..

Keralam State Name Change: Centre gives green signal to change Kerala's name to 'Keralam'
Keralam State Name Change: Centre gives green signal to change Kerala’s name to ‘Keralam’

మలయాళంలో ‘కేరళమ్’ అని పిలుస్తారని అన్నారు. మలయాళం మాట్లాడేవారందరికీ ఒకే రాష్ట్రం కావాలన్న డిమాండ్ జాతీయోద్యమ కాలం నుంచే కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో మన రాష్ట్రం పేరు ‘కేరళ’గా నమోదయ్యిందని, ఆర్టికల్ 3 ప్రకారం ‘కేరళమ్’గా సవరణ చేసి, రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్‌లోని అన్ని భాషల్లో కూడా మార్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల వేళ ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.