రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ కేరళ (kerala) లోని తిరువనంతపురం నుంచి ప్రారంభించారు. ఇందులో తెలంగాణకు కేటాయించిన చర్లపల్లి – తిరువనంతపురం సూపర్‌ఫాస్ట్ రైలు కూడా ఉంది. ఇప్పటికే చర్లపల్లి–ముజఫర్‌పూర్ మధ్య అమృత్ భారత్ రైలు నడుస్తుండగా, ఇది రాష్ట్రానికి రెండో రైలు కావడం విశేషం.
Read Also: Budget2026: RDSS కోసం భారీ బడ్జెట్ పెంపు సన్నాహాలు
ఈ ట్రైన్ వీక్లీ ట్రాన్. దీని రెగ్యులర్ సర్వీసు నంబర్ 17041/17042గా ఉంటుంది. మొత్తం 1546 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సుమారు 31 గంటల 30 నిమిషాలు ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ సగటు వేగం గంటకు 49 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది.చర్లపల్లి (హైదరాబాద్) – తిరువనంతపురం మధ్య ప్రారంభమైన ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వారానికి ఒకసారి సర్వీసు అందిస్తుంది.
రైలు నంబర్ 17041 ప్రతి మంగళవారం ఉదయం 7:15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, మరుసటి రోజు బుధవారం మధ్యాహ్నం 2:45 గంటలకు తిరువనంతపురం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 17042 ప్రతి బుధవారం సాయంత్రం 5:30 గంటలకు తిరువనంతపురం నుంచి బయలుదేరి, గురువారం రాత్రి 11:30 గంటలకు చర్లపల్లి చేరుతుంది.
నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇవే:
- నాగర్‌కోయిల్ – మంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
- తిరువనంతపురం – తాంబరం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
- తిరువనంతపురం – చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ కొత్త రైల్వే సేవలు ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: