📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Kerala: పోలీస్ అకాడమీలోనే గంధపు చెట్ల దోపిడీ

Author Icon By Anusha
Updated: January 8, 2026 • 12:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అది ఓ పోలీస్ అకాడమీ క్యాంపస్. నిత్యం పోలీసులు పహారా కాస్తుంటారు. కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ప్రతిరోజూ వందలమంది పోలీసులు అక్కడ సంచరిస్తుంటారు. అయినా దొంగలు ధైర్యంగా క్యాంపస్ లోకి చొరబడి, విలువైన గంధపు చెక్కలి దోచుకెళ్లారు. ఇంత జరిగినా కూడా పోలీసులు దీన్ని గమనించలేకపోవడం విడ్డూరం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళ (Kerala) లో అత్యంత కట్టుదిట్టం భద్రత కలిగిన త్రిస్సూర్ జిల్లాలోని కేరళ పోలీస్ అకాడమీ క్యాంపస్ నుంచి లక్షల విలువ కలిగిన గంధపు చెట్లు దొంగలు దొంగిలించారు.

Read Also: PM Modi’s Assets : ప్రధాని మోదీ ఆస్తులు ఎంతో తెలుసా?

పోలీస్ అకాడమీలోని, చెట్లను ఎత్తుకెళ్లిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. 30ఏళ్ల కన్నా పాతవైన గంధపు చెట్ల దొంగతనం జరిగిన కొన్ని రోజులకు తెలిసింది. క్యాంపస్ లో ఉన్న పోలీస్ సిబ్బందికి ముందుగా ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. అకాడమీ ఎస్టేట్ అధికారి సతీష్ టియు వియ్యూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

kerala-police-academy-sandalwood-tree-looted

పర్యవేక్షించడం సవాలుగా ఉంది: అధికారులు

త్రిస్సూర్ పోలీస్ అకాడమీ, జిల్లాలోనే అత్యంత సురక్షితం ప్రదేశాల్లో ఒకటిగా ఉంది. సాయుధ పోలీస్ సిబ్బంది క్యాంపస్ లో రాత్రంతా కాపలా కాస్తారు. ప్రతీరోజు వందలాదిమంది పోలీసుల ఉనికి ఉంటుంది. శిక్షణ పొందుతున్న వారు ఈ క్యాంపస్ లో, ఉంటారు. రాష్ట్రపోలీస్ ప్రధాన కార్యాలయం తర్వాత, ఇది కేరళ పోలీసులకు చెందిన అతిపెద్ద శిక్షణే కేంద్రం. ఇది దాదాపుగా 348 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇంత భద్రత ఉన్నప్పటికీ, క్యాంపస్ లోకి ప్రవేశించి గంధపు చెట్లను దొంగిలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

గత నెల డిసెంబర్ 27, జనవరి 2 మధ్య ఈ నేరం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అకాడమీ క్యాంపస్ లోని పెద్ద భాగాలు అడవులతో నిండి ఉన్నాయి. ఎస్టేట్ లో అక్కడక్కడా గంధపు చెట్లు, రోజ్ వుడ్, టేకు చెట్లు ఉన్నాయి. విస్తారంగా ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించడం సవాలుగా ఉందని అధికారులు చెబుతున్నారు. దొంగతనం తర్వాత, అకాడమీ అధికారులు రాత్రిపూట గస్తీని ముమ్మరం చేశారు. బయటి వ్యక్తులు క్యాంపస్ లోకి ప్రవేశించడం, బయటకు వెళ్లడంపై కఠినమైన తనిఖీ చేయాలని ఆదేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Kerala police academy latest news sandalwood theft Telugu News Thrissur district

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.