కేరళ (Kerala) లోని కోజికోడ్ లో, దీపక్ (42) అనే సేల్స్ మెన్ ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణించాడు. జర్నీ టైమ్ లో, బస్సులో దీపక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఇన్ఫ్ల్యూయెన్సర్ షింజితా ముస్తఫా వీడియో తీసి జనవరి 16న సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా, మారడంతో దీపక్ పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తాను అటువంటి వాడిని కాదని.. అవమానభారం భరించలేక దీపక్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Read Also: Udayanidhi Stalin: ఉదయనిధి వ్యాఖ్యలు హద్దులు దాటాయా? హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఘటనపై విచారణ
మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానస్పద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియో కేరళలో తీవ్ర దుమారం రేపుతుండటంతో పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం (జనవరి 21) నిందితురాలు షింజితా ముస్తాఫాను అరెస్ట్ చేశారు. దీపక్ సూసైడ్ కేసును కేరళ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై విచారణ జరిపి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని నార్త్ జోన్ డీజీపీని ఆదేశించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: