Kerala: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్

Read Time:  1 min
Kerala: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్
FONT SIZE
GET APP

ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ చిన్ను పప్పు (అసలు పేరు రేష్మ–24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.. కేరళ (Kerala)లో కాసర్కోడ్ నగర సమీపంలోని అద్దె క్వార్టర్స్‌లో ఆమె సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్న చిన్ను పప్పు స్థానిక భాషలో వీడియోలతో ప్రసిద్ధి చెందింది.

Read Also: Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ

Kerala: Prominent influencer commits suicide
Kerala: Prominent influencer commits suicide

కేసు నమోదు

కాసర్కోడ్ స్థానిక భాషా మాండలికంలో ఆమె చేసే వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. స్థానిక వంటకాలు, భోజనం, ఆ ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించేలా ఆమె చేసే వీడియోలు వైరల్ అయ్యేవి. లక్షలాది మంది నెటిజన్లు ఆమె వీడియోలను వీక్షించేవారు. రేష్మ మరణానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే, పోలీసులు ప్రాథమికంగా సేకరించిన సమాచారం ప్రకారం.. ఆమెకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. కేవలం నెల రోజుల క్రితమే ఆమె విడాకులు తీసుకున్నట్లు సమాచారం. విడాకుల అనంతరం తలెత్తిన మనస్తాపం లేదా వ్యక్తిగత కారణాలేమైనా ఈ ఆత్మహత్యకు దారితీశాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆదూర్ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.