Kerala High Court: కేరళ సీఎంఓపై హైకోర్టు సీరియస్

Read Time:  1 min
Kerala High Court: కేరళ సీఎంఓపై హైకోర్టు సీరియస్
FONT SIZE
GET APP

Kerala High Court: కేరళ ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత గోప్యత విషయంలో ఆ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ సిబ్బందికి సంబంధించిన ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడిలను ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) అనధికారికంగా సేకరించి, రాజకీయ ప్రచార సందేశాల కోసం వినియోగిస్తోందని వస్తున్న ఆరోపణలపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. తమ ప్రమేయం లేకుండా, ప్రభుత్వం తన విజయాలను వివరిస్తూ పంపిస్తున్న వాట్సాప్ మెసేజ్‌లు వ్యక్తిగత గోప్యతా హక్కు (Right to Privacy) ఉల్లంఘన కిందకే వస్తాయని ప్రాథమికంగా అభిప్రాయపడింది.

Read Also: Rajasthan: పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థిని కిడ్నాప్.. ఎందుకంటే..?

Kerala High Court: High Court serious about Kerala CMO
Kerala High Court: High Court serious about Kerala CMO

మెసేజ్‌లు పంపొద్దు

రాష్ట్రంలోని 5.42 లక్షల మంది ఉద్యోగులు, 62 లక్షల మంది ప్రభుత్వ సంక్షేమ పింఛన్ల లబ్దిదారులు, 10 లక్షల మంది మహిళా భద్రతా పథకాల లబ్దిదారులు సమా మొత్తం 77 లక్షల మంది మొబైల్ నంబర్లు, వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా సేకరించారనే ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.వాట్సాప్‌ మెసేజ్‌లతో ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయడానికి సీఎంఓ సోషల్ మీడియా విభాగం ఈ డేటాను ఉపయోగించినట్టు పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రభుత్వ ఉద్యోగులకు మెసేజ్‌లు పంపొద్దని కేరళ సీఎం ఆఫీసును హైకోర్టు ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.