📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest News: Mohanlal: మోహన్‌లాల్‌కు కేరళ ప్రభుత్వం సన్మానం

Author Icon By Anusha
Updated: October 5, 2025 • 1:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతీయ సినిమా రంగంలో అత్యున్నతమైన పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకున్న మలయాళ సినీ దిగ్గజం మోహన్‌లాల్ ను కేరళ ప్రభుత్వం ఘన సన్మానం చేసింది.మలయాళం వానోళం, లాల్ సలాం(Malayalam Vaanolam, Laal Salam) పేరుతో తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Chief Minister Pinarayi Vijayan) ముఖ్య అతిథిగా హాజరై మోహన్‌లాల్‌ను సత్కరించారు.

Kantara: ‘కాంతార’ కథకు ప్రేరణ ఏది?

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ మోహన్‌లాల్‌ను ప్రతి మలయాళీకి గర్వకారణంగా అభివర్ణించారు. మలయాళ సినిమా (Malayalam cinema) కళాత్మకంగా, వాణిజ్యపరంగా ఎదగడంలో మోహన్‌లాల్ పాత్ర ఎంతో ఉందని ప్రశంసించారు.

2004లో లెజెండరీ ఫిల్మ్ మేకర్ అడూర్ గోపాలకృష్ణన్ తర్వాత, రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ కేరళకు ఈ అత్యున్నత గౌరవాన్ని మోహన్‌లాల్ తీసుకురావడం గొప్ప విషయమన్నారు.సన్మానం అందుకున్న అనంతరం మోహన్‌లాల్ (Mohanlal) మాట్లాడుతూ.. ఢిల్లీలో అవార్డు అందుకోవడం కంటే తాను పుట్టి పెరిగిన స్వస్థలంలో, సొంత ప్రజలు ప్రభుత్వం నుంచి గౌరవం దక్కడం తనకు మరింత భావోద్వేగాన్ని కలిగించిందని తెలిపారు.

ఈ జ్ఞాపకాలు నా ఆత్మలో భాగం

ఈ గాలి, ఈ ప్రదేశాలు, ఈ జ్ఞాపకాలు నా ఆత్మలో భాగం. ఇలాంటి భావోద్వేగాలను నటించలేం” అని ఆయన పేర్కొన్నారు. ఈ అవార్డు మలయాళ చిత్ర పరిశ్రమకు, తనను ఆదరించిన ప్రేక్షకులందరికీ అంకితమని మోహన్‌లాల్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ప్రముఖ సినీ, సాంస్కృతిక ప్రముఖులు, వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు.

ఈ వేడుకలో మోహన్‌లాల్ నటించిన చిత్రాల పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మోహన్‌లాల్ సెప్టెంబర్ 23, 2025న ఢిల్లీలో జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News dadasahib phalke award kerala government honor laal salam event latest news malayalam cinema legend malayalam vaanolam Mohanlal Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.