📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kerala: చిన్నారి అవయవాలతో ఐదుగురికి కొత్త జీవితం

Author Icon By Saritha
Updated: February 14, 2026 • 11:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తీవ్ర విషాదంలో ఓ కుటుంబం తీసుకున్న గొప్ప నిర్ణయం ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. కేవలం పది నెలల వయసున్న ఓ చిన్నారి, కేరళ (Kerala) రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన అవయవదాతగా నిలిచింది. పత్తనంతిట్ట జిల్లాకు చెందిన అలిన్ షెరిన్ అబ్రహం అనే ఈ చిన్నారి అవయవాలను (Organs) ఐదుగురికి అమర్చనున్నారు.

ఫిబ్రవరి 5న (Kerala) కొట్టాయం నుంచి తిరువళ్ల వెళ్తుండగా ఎం.సి. రోడ్డులో అలిన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెతో పాటు కారులో ఉన్న తల్లి, తాతయ్య, నాయనమ్మ కూడా గాయపడ్డారు. వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించి, మెరుగైన చికిత్స కోసం ఫిబ్రవరి 7న కొచ్చిలోని అమృత ఆసుపత్రికి మార్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఫిబ్రవరి 13న చిన్నారి బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు వైద్యులు ప్రకటించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ, చిన్నారి తల్లిదండ్రులు అరుణ్ అబ్రహం, షెరిన్ ఆన్ జాన్ తమ కుమార్తె అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు.

Read Also: Bihar: విషం రుచి చూసి నలుగురు బాలికలు మృతి

Kerala Five people get new life with child’s organs

కుమార్తె అవయవాలు దానం చేసిన తల్లిదండ్రులు

చిన్నారి కాలేయం, రెండు కిడ్నీలు, గుండె కవాటం, రెండు కనుగుడ్లను సేకరించారు. కాలేయాన్ని తిరువనంతపురంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరు నెలల బాబుకు అమర్చనున్నారు. రెండు కిడ్నీలను తిరువనంతపురం మెడికల్ కాలేజీలోని శాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో చిన్నారికి, గుండె కవాటాన్ని శ్రీ చిత్ర ఇనిస్టిట్యూట్‌కు పంపారు. కనుగుడ్లను అమృత ఆసుపత్రిలోనే ఉంచారు.

కచ్చి నుంచి తిరువనంతపురానికి అవయవాలను తరలించేందుకు పోలీసులు, ప్రజల సహకారంతో గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. సాధారణంగా ఆరు గంటల ప్రయాణాన్ని కేవలం 3 గంటల 15 నిమిషాల్లో పూర్తి చేశారు. ఈ ప్రక్రియనుఈ మొత్తం ప్రక్రియను కేరళ స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (KSOTTO) పర్యవేక్షించింది. తల్లిదండ్రుల విషాదానికీ మధ్యలో గొప్ప నిర్ణయం తీసుకున్న చిన్నారి కోసం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ కృతజ్ఞతలు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Alin Sherin Abraham Amrita Hospital Kerala organ donation KIMS Hospital Latest News in Telugu organ transplant pediatric organ transplant Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.