📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Kerala: పులి తో పోరాడి కొడుకును కాపాడుకున్న తండ్రి

Author Icon By Sharanya
Updated: August 2, 2025 • 2:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కన్న కొడుకు ప్రాణాలను కాపాడేందుకు యముడితోనైనా పోరాడతానంటారు. ఆ మాటలు నిజమని నిరూపించిన ఘనత ఈ తండ్రి బేబీదే. కేరళ (Kerala) లోని కట్టుదిట్టు అడవి ప్రాంతమైన మలక్కపారలో, ఓ చిరుతపులి (Leopard) ఇంట్లోకి చొరబడి బాలుడిని తీసుకెళ్లబోతుండగా తండ్రి చూపిన అసాధారణ ధైర్యం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

తెల్లవారుజామున ఉత్కంఠభరిత దృశ్యం

గురువారం తెల్లవారుజామున 2:45 సమయంలో బేబీ, రాధిక దంపతులు తమ నాలుగేళ్ల కుమారుడు (Four year old son) రాహుల్‌తో కలిసి గుడిసెలో నిద్రలో ఉన్నారు. అనూహ్యంగా ఓ చిరుతపులి ఇంట్లోకి ప్రవేశించి, నిద్రిస్తున్న చిన్నారిని నోట పట్టుకుని బయటకు లాక్కెళ్లే ప్రయత్నం చేసింది. బాలుడు భయంతో గట్టిగా అరవడంతో తల్లిదండ్రులు మేలుకున్నారు.

తండ్రి ధైర్యం – చిరుతకు ఎదురుదెబ్బ

కొడుకును చిరుత తినబోతుందన్న నిర్ఘాంతపోయారు. తండ్రి బేబీ, ఏమాత్రం భయపడకుండా ప్రాణాలకు తెగించి చిరుతను ఎదుర్కొన్నాడు. గట్టిగా అరుస్తూ దానిపైకి వెళ్లడంతో బెదిరిపోయిన చిరుతపులి బాలుడిని అక్కడే వదిలేసి అడవిలోకి పారిపోయింది. గట్టిగా అరుస్తూ దాని దృష్టిని మరల్చగా.. చిరుత భయంతో బాలుడిని వదిలేసి వెంటనే అడవిలోకి పరుగెత్తింది.

బాలుడికి స్వల్ప గాయాలు – చికిత్స కొనసాగుతుంది

ఈ ఘటనలో చిన్నారికి తలకు స్వల్ప గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వెంటనే అతన్ని టాటా ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం చాలకుడి తాలూకా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

రుస చిరుత దాడులతో ప్రజలు భయభ్రాంతులు

ఇది గత రెండు నెలల్లో మలక్కపార్ ప్రాంతంలో నమోదైన మూడో చిరుత దాడి కావడం గమనార్హం. వరుస దాడులతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అటవీ శాఖ తక్షణ చర్యలు తీసుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/madhya-pradesh-13-year-old-boy-commits-suicide-after-losing-rs-2800-in-online-game/crime/524815/

Breaking News Father Saves Son Kerala latest news Leopard attack Malakkapar Incident Telugu News Wild Animal Attack

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.