Kerala: పుచ్చకాయల లోడులో పేలుడు పదార్థాలు

Read Time:  1 min
Kerala: పుచ్చకాయల లోడులో పేలుడు పదార్థాలు
FONT SIZE
GET APP

కేరళ (Kerala) లోని పాలక్కాడ్ పట్టణ సమీపంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు అనుమానాస్పద పికప్ వ్యాన్‌ను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా పుచ్చకాయల లోడ్ కింద దాచిన వందకు పైగా జిలెటిన్ స్టిక్స్, 20కి పైగా డిటోనేటర్ల పెట్టెలు లభ్యమయ్యాయి. ఈ ఘటనతో తీవ్ర కలకలం రేగింది.అనంతరం వ్యాన్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు పట్టుబడటంతో ఈ విషయాన్ని అత్యంత సీరియస్ గా తీసుకున్నారు.

Read Also: Odisha: పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు

Kerala: Explosives found in watermelon shipment
Kerala: Explosives found in watermelon shipment

దర్యాప్తు

“సుమారు 100 పెట్టెల జిలెటిన్ స్టిక్స్, 20 పెట్టెల డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నాం. వీటిని ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు? ఎవరికి సరఫరా చేస్తున్నారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నాం” అని పాలక్కాడ్ టౌన్ సౌత్ పోలీస్ అధికారి తెలిపారు. సాధారణంగా ఇలాంటి పేలుడు పదార్థాలను అక్రమ క్వారీయింగ్, బావుల తవ్వకాల కోసం వాడుతుంటారు. అయితే, వీటి వెనుక మరేదైనా కుట్ర ఉందా? లేదా ఉగ్రవాద కోణాలు ఏమైనా ఉన్నాయా? అనే దిశగా కూడా దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.