📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Telugu news: Kerala: పక్షులను స్మగ్లింగ్ చేసిన ముఠాను అరెస్ట్ చెసిన కస్టమ్ అధికారులు

Author Icon By Tejaswini Y
Updated: December 5, 2025 • 4:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంతరించిపోతున్న అరుదైన పక్షులను దొంగచాటుగా రవాణా చేసి సొమ్ము చేసుకోవడం కొందరు స్మగ్లర్ల(smuggling)కు పరిపాటిగా మారింది. అలాంటి చర్యను కేరళ(Kerala)లో మరోసారి కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. ఎర్నాకులంలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో థాయ్‌ల్యాండ్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్న 11 విలువైన వన్య పక్షులను స్వాధీనం చేసుకుంటూ ఓ జంటను అధికారులు అరెస్ట్ చేశారు.

Read Also: TR Balu : బీజేపీ మ‌త విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నది .. డీఎంకే నేత టీఆర్ బాలు

థాయ్‌ల్యాండ్ నుంచి కౌలాలంపూర్ మార్గంగా కొచ్చికి చేరుకున్న ఆ జంటను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తుండగా, వారి లగేజీపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకున్నారు. బ్యాగులు తెరిచి చూసిన అధికారులు షాకయ్యారు ప్రత్యేకంగా రూపొందించిన గుప్త ఖానాలలో అరుదైన పక్షులను దాచిపెట్టి రవాణా చేస్తున్నట్లు బయటపడింది. ఆ దంపతులతో పాటు వారి ఏడేళ్ల కుమారుడు కూడా ప్రయాణిస్తున్నాడు.

Kerala: Customs officials arrest bird smuggling gang

CITES నిబంధనల ప్రకారం

అంతర్జాతీయ వన్యప్రాణి రక్షణ ఒప్పందమైన CITES నిబంధనల ప్రకారం, స్వాధీనం చేసుకున్న పక్షులను అటవీ శాఖకు అప్పగించారు. మలయత్తూరు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కార్తీక్ తెలిపారు, ఈ కేసు మీద దర్యాప్తు ప్రారంభమైందని, ప్రాథమిక విచారణ అనంతరం సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

CITES నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి అంతరించిపోతున్న జాతుల అక్రమ రవాణా తీవ్రమైన నేరం. స్వాధీనం చేసిన జంతువులు లేదా పక్షులను అవి చెందిన దేశానికే తిరిగి పంపాలని ఆ ఒప్పందం పేర్కొంటుంది. అందుకే పక్షులకు అవసరమైన వైద్య చికిత్స చేసి తిరిగి థాయ్‌ల్యాండ్‌కు పంపే ప్రక్రియను అటవీ శాఖ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

https://vaartha.com/national/shashi-tharoor-i-was-not-elected-to-shout/598627/

CITES Violation Ernakulam Airport Kerala Customs Seizure Rare Birds Trafficking Thailand to Kochi Smuggling Wildlife Smuggling

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.