కేరళ (Kerala) లో బస్సులో దీపక్ అనే వ్యక్తిపై లైంగిక ఆరోపణలు చేసి అతని ఆత్మహత్యకు, కారణమైన షింజితా ముస్తఫాకు కోజికోడ్ కోర్టు షాకిచ్చింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ప్రస్తుతం సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వీడియోను అప్‌లోడ్ చేసిన ఫోన్‌ను సైంటిఫిక్ అనాలసిస్‌కు పంపామన్నారు. ఈ దశలో ఆమెను విడుదల చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్న వాదనలతో కోర్టు ఏకీభవించింది.
Read Also: Ajit Pawar: అజిత్ పవార్ మృతి పై ప్రధాని మోదీ, అమిత్ షా దిగ్భ్రాంతి
అసలేం జరిగింది?
కేరళ (Kerala) లోని కోజికోడ్ లో, దీపక్ (42) అనే వ్యక్తి, ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణించాడు. జర్నీ టైమ్ లో, బస్సులో దీపక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఇన్ఫ్ల్యూయెన్సర్ షింజితా ముస్తఫా వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా, మారడంతో దీపక్ పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తాను అటువంటి వాడిని కాదని.. అవమానభారం భరించలేక దీపక్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: