Kerala: సాధారణంగా ఏ సంస్థ అయినా తమ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు పండగల సందర్భంగా గిఫ్టులు, బోనస్‌లు ఇస్తుంటుంది. దీపావళి, ఉగాది, క్రిస్మస్ వంటి పండగల సమయంలో కానుకలు ఇవ్వడం, వార్షిక బోనస్‌లు అందించడం ఇప్పుడు చాలా కంపెనీల్లో సాధారణంగా మారిపోయింది. అయితే ఉద్యోగుల కృషిని మరింత గొప్పగా గుర్తిస్తూ, వారిని నిజంగా ఆశ్చర్యానికి గురిచేసే నిర్ణయం తీసుకున్న సంస్థలు మాత్రం అరుదుగా కనిపిస్తాయి. అలాంటి అరుదైన ఉదాహరణగా ఇప్పుడు ఒక కంపెనీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Read Also: Delhi: ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
47 మంది ఉద్యోగులకు రూ.20 కోట్ల విలువైన కార్లు బహుమతి
సంస్థ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులకు ఏకంగా కార్లనే గిఫ్ట్‌గా అందచేసింది, ఈ కంపెనీ. రూ.20 కోట్లతో 47 కార్లును కొనుగోలు చేసిన ఉద్యోగులకు కానుకగా అందజేసింది. కేరళకు చెందిన హైలైట్ గ్రూప్ ప్రారంభమై మూడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చింది.రిటైల్ స్పేస్ రంగంలో కేరళలోనే అగ్రగామిగా ఉన్న ఈ సంస్థను 1996లో స్థాపించారు.
కంపెనీ ఏర్పాటుచేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాలికట్‌లో ఘనంగా వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకల్లోనే ఉద్యోగులకు ఖరీదైన కార్లను గిఫ్ట్‌గా ఇచ్చింది. కంపెనీ ప్రారంభం నుంచి పనిచేస్తోన్న 47 మంది ఉద్యోగులకు రూ.20 కోట్ల విలువైన కార్లను అందజేసింది. ఇందులో రేంజ్ రోవర్, లాండ్ రోవర్ డిఫెండర్, ఆడీ క్యూ8, టాటా హ్యారియర్, కియా సెల్టాస్, హ్యుందయ్ క్రెటా, స్కోడా వంటి మోడళ్లు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: