సోషల్ మీడియాలో వైరల్ కావడంతో – హుటాహుటిన కేరళకు పోలీసులు – కేరళలో చిన్నారి స్వాధీనం
కదిరి (Anantapur District): డబ్బుల కోసం కన్న కూతురుని విక్రయించిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో చోటు చేసుకోవడం కలవరమైంది. కదిరి రూరల్ (Kadiri Rural) మండలం మరవతాండకు చెందిన శ్రీవాణి (Srivani), రవీంద్రనాయక్ (Ravindra Nayak) ఉపాధి నిమిత్తం కేరళకు వలస వెళ్లారు. అక్కడే కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వారికి మూడో సంతానమైన మూడేళ్ల చిన్నారి జశ్వితబాయిని (Jaswitabai), కేరళ (Kerala) రాష్ట్రాంలో కొతాయం అనే ప్రాంతానికి చెందిన రాజేష్ (Rajesh) అనే వ్యక్తికి విక్రయించి గుట్టు చప్పుడు కాకుండా స్వస్థలానికి చేరుకున్నారు. చిన్నారిని రెండు నెలల క్రితమే “ విక్రయించినప్పటికీ బయట పడకుండా శ్రీవాణఙ, రవీంద్రనాయక్ దంపతులు జాగ్రత్తలు పడ్డారు. అయితే అదే గ్రామానికి చెందిన రామచంద్రనాయక్, వారి బంధువులు కేరళ (Kerala) రాష్ట్రానికి ఉపాధికోసం వెళ్లారు. కొతాయం ప్రాంతంలో కూలీపనులు చేసుకుంటున్న వీరికి ఆ చిన్నారి కంఠ పడింది. మా పాప మీ దగ్గర ఎందుకుందని రాజేష్ అనే వ్యక్తిని వారు నిలదీయగా, అయితే ఆ ప్రాంతంలో పలుకుపబడి ఉన్న రాజేష్, రామచంద్రనాయక్ ఉండే అద్దె ఉన్న ఇంటి యజమానిని బెదిరించి ఖాళీ చేయించారు.
సకాలంలో స్పందించిన పోలీసులు – కేరళ (Kerala) నుంచి చిన్నారి జశ్వితను రక్షించిన ప్రత్యేక బృందం
మరువతాండాకు చేరుకున్న రామచంద్రనాయక్ వారి బంధువులను పిలిపించి జరిగిన విషయాన్ని తెలిపారు. మూకుమ్మడిగా అందరూ కలిసి దంపతులను నిలదీయడంతో అసలు విషయం బయట పడింది. ఈ దశలో ఇరువురు ఘర్షణ పడి గాయాలు కావడంతో ఆసుపత్రికి చేరారు. పూర్తి స్థాయిలో చిన్నారి విక్రయ ఘటన బయట పడటంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్గా మారి, పోలీస్ స్టేషన్ కు పంచాయితీ చేరింది. డిఎస్పీ శివనారాయణస్వామి అప్గ్రేడ్ స్టేషన్ కు చేరుకుని ఘటనపై సిఐ నిరంజన్రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులను విచారించి చిన్నారి విక్రయ ఘటనను నివేదికను అందజేయాలని డిఎస్పీ ఆదేశించడంతో సిఐ నిరంజన్రెడ్డి చిన్నారి తల్లిదండ్రులు శ్రీవాణి, రవీంద్రనాయక్లను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని ఒప్పుకోవడంతో ఎనిపికుంట ఎస్ఐ వలీబాషా ఆధ్వర్యంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి కేరళకు పంపించారు. శుక్రవారం కేరళ రాష్ట్రంలోని కొతాయం ప్రాంతానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాజేష్ అనే వ్యక్తి ఇంటిలో ఉన్న మూడేళ్ల చిన్నారి జశ్విత బాయిని స్వాధీనం చేసుకుని కదిరికి తీసుకొస్తున్నారు. సకాలంలో పోలీసులు చాక చక్యంగా స్పందించి ప్రత్యేక టీంను కేరళకు పంపి చిన్నారిని స్వాధీనం చేసుకోవడం పట్ల ప్రజలు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు
Read also: Chevireddy Mohit Reddy: లిక్కర్ స్కామ్ కేసులో చెవి రెడ్డికి హైకోర్టులో దొరకని ఊరట