Kerala Assembly Elections: కేరళ కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల

Read Time:  1 min
Kerala Assembly Elections: కేరళ కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల
FONT SIZE
GET APP

Kerala Assembly Elections: కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఏప్రిల్ 9న జరగనున్న పోలింగ్‌కు నామినేషన్ల గడువు సమీపిస్తున్న తరుణంలో, గురువారం రాత్రి పార్టీ అధిష్ఠానం 37 మంది అభ్యర్థులతో కూడిన తుది జాబితాను విడుదల చేసింది. గత నాలుగు రోజులుగా సాగిన చర్చలు, సంప్రదింపులు మరియు అంతర్గత విభేదాల తర్వాత ఈ జాబితా వెలువడింది.

Read Also: Pinarayi Vijayan : కేరళం సీఎం విజయన్ ఆస్తి ఎంతో తెలుసా ?

కే సుధాకరన్ బుజ్జగింపు.. సద్దుమణిగిన సంక్షోభం

మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ 92 స్థానాల్లో పోటీ చేయనుండగా, సీపీఎం నుంచి బయటకు వచ్చిన ముగ్గురు రెబల్ నేతలకు మద్దతు ఇస్తోంది. సీనియర్ నేత, కన్నూర్ ఎంపీ కె. సుధాకరన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో జాబితా విడుదల ఆలస్యమైంది. ఆయన పార్టీని వీడతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, సీనియర్ నేత ఏకే ఆంటోనీ చివరి నిమిషంలో రంగంలోకి దిగి ఆయనతో చర్చలు జరిపి బుజ్జగించడంతో సంక్షోభం సద్దుమణిగింది. తాను కాంగ్రెస్ ముందు చాలా చిన్నవాడినని, ఎన్నికల ప్రచారంలో ముందుంటానని సుధాకరన్ పేర్కొన్నారు.

Kerala Assembly Elections: Final list of Kerala Congress candidates released
Kerala Assembly Elections: Final list of Kerala Congress candidates released

విడుదలైన జాబితాలో సీనియర్లు, కొత్త ముఖాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు ఎన్.శక్తన్, వి.శివకుమార్ వంటి సీనియర్లకు చోటు కల్పించారు. అదే సమయంలో, పార్టీ విధేయులైన ఈబీ కురియకోస్, పాలకులం మధు వంటి వారికి తొలిసారి అవకాశం ఇచ్చారు. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎల్డోస్ కున్నపల్లికి టికెట్ నిరాకరించడం అసంతృప్తికి దారితీసింది. తనను ఎందుకు పక్కనపెట్టారో అర్థం కావడం లేదని, మద్దతుదారులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన అన్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన సందీప్ వారియర్‌ను సీపీఎం కంచుకోట త్రికరిపూర్ నుంచి బరిలోకి దించారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.