📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kashi: మహాశివరాత్రి వేళ విశ్వేశ్వరుడికి ప్రత్యేక కానుకలు

Author Icon By Saritha
Updated: February 16, 2026 • 11:04 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక రాజధాని కాశీ (Kashi) సరికొత్త చరిత్రకు వేదికైంది. మహాశివరాత్రి (Mahashivratri) వేడుకల్లో భాగంగా ట్రస్ట్.. వివిధ ఆలయాల మధ్య కానుకల మార్పిడి కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే దీనికి విశేష స్పందన లభించింది. కేవలం భారత దేశంలోని ఆలయాలే కాకుండా మలేషియా, శ్రీలంక వంటి అంతర్జాతీయ దేశాల నుంచి కూడా భక్తులు తమ ఆరాధ్య దైవాల తరపున విశ్వనాథుడికి కానుకలు పంపారు. దేశవిదేశాల్లోని 63 ప్రసిద్ధ దేవాలయాల నుంచి పవిత్ర జలాలు, నైవేద్యాలు, వస్త్రాలు, మట్టి కాశీ విశ్వనాథుడికి కానుకలుగా అందాయి.

Read Also: Tamil Nadu Politics : తమిళనాట మరో కొత్త రాజకీయ పార్టీ ?

Special gifts to Lord Vishweshwara on Mahashivratri

పుణ్యక్షేత్రాలివే..!

ఈ ఆధ్యాత్మిక మార్పిడిలో దేశంలోని నలుమూలల నుంచి ప్రముఖ ఆలయాలు భాగస్వాములు అయ్యాయి. ముఖ్యంగా తమిళనాడు నుంచి శ్రీ రత్నగిరీశ్వర, అనంత పద్మనాభ స్వామి, అరుణ్మిగు భూమినాథ ఈశ్వరర్ వంటి అనేక ఆలయాలు తమ ప్రాంతపు విశిష్ట కానుకలను పంపాయి. అలాగే ముంబైలోని సిద్ధివినాయక, లాల్‌బాగ్చా రాజా, మథుర శ్రీకృష్ణ జన్మస్థాన్, జమ్మూ కాశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి బోర్డు, ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, గుజరాత్ ద్వారకాదీశ్, రాజస్థాన్ నాథ్‌ద్వారా ఆలయాల నుంచి నైవేద్యాలు అందాయి. (Kashi) కాశీలోని కాల భైరవ, అన్నపూర్ణ, విశాలాక్షి, కామాఖ్య, వింధ్యవాసిని దేవాలయాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. కేవలం కానుకలను అందుకోవడమే కాకుండా కాశీ విశ్వనాథుడి ప్రసాదాన్ని, పవిత్ర సామగ్రిని ఆయా 63 దేవాలయాలకు రిటర్న్ గిఫ్టుగా ట్రస్ట్ పంపింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Hindu festival Kashi Kashi Vishwanath Temple Latest News in Telugu Mahashivratri Spiritual India Telugu News Temple Exchange Program varanasi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.