తమిళనాడులోని కరూరు(Karur )లో విజయ్ పార్టీ సమావేశంలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా ఆవేదన కలిగించింది. ఈ ఘటనలో 33 మంది మృతిచెందగా, డజన్లకొద్దీ మంది గాయపడ్డారు. చిన్న స్థలంలో వేలాదిమంది గుమిగూడడం, భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోవడం ఈ విషాదానికి కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ దుర్ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా చాలామంది “పుష్ప–2” (Pushpa 2 )మూవీ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను గుర్తు చేస్తున్నారు. ఆ ఘటనలో ఒక మహిళ మృతిచెందగా, నిర్వాహక లోపాలపై కేసు నమోదై హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు విచారణకు పిలిచి అరెస్ట్ చేసిన విషయం అప్పట్లో సంచలనం రేపింది. అదే తరహాలో కరూర్ ఘటనలోనూ పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో తలపతి విజయ్(Vijay)పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Kanakadurga Temple : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
అయితే న్యాయనిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇటువంటి సంఘటనల్లో నిర్వాహకులు, భద్రతా అధికారులపైనే ఎక్కువగా బాధ్యతలు పడతాయి. ఈ ఘటనపై దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఎవరి పాత్ర ఏమిటో స్పష్టమవుతుందని వారు అంటున్నారు. అయినప్పటికీ, కరూర్ విషాదం అనంతరం విజయ్ అరెస్టు చేస్తారా అనే అంశం రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రజలు, అభిమానులు మాత్రం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.