📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest News: Vijay: కరూర్‌ తొక్కిసలాట.. విజయ్ వ్యూహం మారనుందా?

Author Icon By Anusha
Updated: October 5, 2025 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ దుర్ఘటనను కేంద్రంగా చేసుకొని రాజకీయ రంగంలో వివిధ పార్టీలు తమ వ్యూహాలను మార్చుకోవడం గమనార్హం.

విజయ్ నేతృత్వంలోని టీవీకే (Tamil Vetri Kazhagam) పార్టీ కు చెందిన నాయకత్వంతో బీజేపీ సంప్రదింపులు జరిపినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి కాషాయ పార్టీ విజయ్ భారీ అభిమానులను వినియోగించుకోడానికి కృషి చేస్తోందని వర్గాలు సూచించాయి.

Canada: తమ దేశంలో ఖలిస్థానీ సంస్థలకు నిధులు అందుతున్నాయని అంగీకరించిన కెనడా

టీవీకే నాయకత్వంతో సంప్రదింపులు జరిపిన బీజేపీ సీనియర్ నేత ఒకరు.. డీఎంకే అన్యాయంగా విజయ్‌ను టార్గెట్ చేసుకుంటే ఆయన ఒంటరికాదని చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ ఘటనపై సీబీఐ (CBI) విచారణ కోరుతూ టీవీకే వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. డీఎంకేను ఇరుకునపెట్టాలని భావిస్తోన్న బీజేపీ.. తన రాజకీయ భవిష్యత్తును అగమ్యగోచరంలో పడేసిన కరూర్ తొక్కిసలాట ఘటన నుంచి బయటపడటానికి విజయ్ కాస్త ఓర్పు పాటించాలని సలహా ఇచ్చినట్టు సమాచారం.

తనకు మద్దతు తెలిపిన రాజకీయ నాయకులకు విజయ్ కృతజ్ఞతలు

మరోవైపు, ఈ విషాద ఘటన అనంతరం తనకు మద్దతు తెలిపిన రాజకీయ నాయకులకు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా టీవీకేతో సంప్రదింపులు జరిపిందని సమాచారం.

Vijay

ఇది, రాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న ద్రావిడ ప్రధాన పార్టీలు డీఎంకే, అన్నాడీఎం (AIADMK) లకు గండికొట్టి జాతీయ పార్టీలు తమ ఉనికిని చాటుకోడానికి ఈ పరిణామాన్ని అవకాశంగా చూస్తున్నాయని సూచిస్తుంది.ఇటీవల పరిణామాలు తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్నే మార్చే అవకాశాలు ఉన్నాయి.

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తానని ప్రకటించిన విజయ్

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తానని ప్రకటించిన విజయ్.. తాజా పరిణామాలో తన వ్యూహాన్ని మార్చుకునే అవకాశం ఉంది. కాగా, ఇటీవల తమిళనాడు బీజేపీ ఇంఛార్జ్‌ (Tamil Nadu BJP in-charge) గా నియమితులైన జయ్ పాండా అక్టోబర్ 6న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా తమిళనాడులోని బీజేపీ సీనియర్ నేతలు, పదాధికారులతో సమావేశం కానున్నారు.

అటు, ఢిల్లీలో ఉన్న తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై.. కరూర్‌లో జరిగిన తొక్కిసలాట (stampede) ఘటన వివరాలు, దాని రాజకీయ ప్రభావంపై పార్టీ నాయకులకు నివేదిక ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకేపై వ్యతిరేకత స్పష్టంగా ఉంటుందని భావిస్తోన్న బీజేపీ.. విపక్ష ఓట్ల చీలిపోకూడదనే వ్యూహంతో టీవీకేపై దృష్టి సారిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

bjp talks with vijay Breaking News karur stampede political impact latest news tamil nadu assembly elections 2026 Telugu News ttv leader negotiations ttv party vijay vijay fan influence

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.