📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest Telugu News: Vijay-కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే జిల్లా కార్యదర్శి అరెస్ట్

Author Icon By Vanipushpa
Updated: October 1, 2025 • 12:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు(Tamilnadu)లోని కరూర్‌లో నటుడు విజయ్(Vijaya) నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే)(TVK) పార్టీ సభలో జరిగిన ఘోర తొక్కిసలాట కేసులో దర్యాప్తు వేగవంతమైంది. 41 మంది ప్రాణాలను బలిగొన్న ఈ దుర్ఘటనకు సంబంధించి పార్టీ పశ్చిమ జిల్లా కార్యదర్శి మదియళగన్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది.

మహిళలు, చిన్నారులతో సహా 41 మంది మృతి

గత వారం కరూర్ సమీపంలోని వేలాయుధపాలయంలో జరిగిన ఈ సభలో విజయ్ ప్రసంగం ముగించిన తర్వాత తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సభా ప్రాంగణంలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనం భయాందోళనలకు గురయ్యారు. చీకట్లో బయటకు వెళ్లే దారుల వైపు, బ్యాకప్ లైట్ల వైపు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులతో సహా 41 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడ్డారు.

Vijaya-కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే జిల్లా కార్యదర్శి అరెస్ట్

ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించడంపై చర్యలు

ఈ కేసు విచారణను రాష్ట్ర ఉన్నత పోలీస్ యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తోంది. మొదట కరూర్ డీఎస్పీ సెల్వరాజ్ (DSP Selvaraj) ఆధ్వర్యంలో ఉన్న దర్యాప్తును, మరింత లోతుగా విచారించేందుకు అదనపు ఎస్పీ ప్రేమానంద్‌కు అప్పగించారు. మానవ ప్రాణాలకు ప్రమాదం కలిగించడం, ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించడం వంటి ఐదు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే టీవీకే ప్రధాన కార్యదర్శి ఆనంద్, సంయుక్త ప్రధాన కార్యదర్శి నిర్మల్‌కుమార్‌ల(Nirmal Kumar)పై అభియోగాలు మోపారు. ప్రస్తుతం ఆనంద్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేరని పోలీసులు తెలిపారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం.. ముగ్గురి అరెస్ట్

మరోవైపు, ఈ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వదంతులు వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలపై పెరుంబక్కంకు చెందిన సాగయం (బీజేపీ), మంగాడుకు చెందిన శివనేశన్ (టీవీకే), ఆవడికి చెందిన శరత్‌కుమార్ (టీవీకే సోషల్ మీడియా నిర్వాహకుడు) అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఈ దుర్ఘటనపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. సీఎం ఎంకే స్టాలిన్, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. “జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాం. బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలి” అని ఆయన కోరారు. అయితే ఇది ప్రభుత్వ వైఫల్యమేనని ప్రతిపక్ష ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి ఆరోపించారు. సభకు సరైన భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

విజయ్ బాల్యం

ఆయన తన బాల్యం చెన్నైలో గడిపాడు. ప్రారంభ విద్యను కోడంబాక్కం లోని ఫాతిమా హయ్యర్ సెకండరీ పాఠశాలలో పూర్తిచేసాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Arrest Karur News karur stampede police investigation stampede incident Tamil Nadu News TVK District Secretary TVK party

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.