📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Latest News: Karur Stampede: తమిళనాడు ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్రం

Author Icon By Anusha
Updated: September 28, 2025 • 9:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడులోని కరూర్ జిల్లాలో శనివారం జరిగిన ఘోర తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు దళపతి విజయ్  (Vijay)నేతృత్వంలో నూతనంగా ఏర్పాటైన ‘తమిళగ వెట్రికలగం’ (టీవీకే) పార్టీ ((TVK) Party) తరఫున భారీ స్థాయిలో నిర్వహించిన బహిరంగ సభ ఈ విషాదానికి వేదికైంది.

వేలాది మంది అభిమానులు, హాజరైన ఈ సభలో ఊహించని రీతిలో తోపులాటలు చోటుచేసుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఫలితంగా ఊపిరాడక, కిందపడిపోయి, జనాల కాళ్ల కింద నలిగిపోవడం వల్ల 39 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 46 మందికి పైగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Vijay: విజయ్ ర్యాలీలో.. తొక్కిసలాటకు కారణాలు ఇవే!

తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Union Home Ministry) తీవ్రంగా స్పందించింది. ఈ దుర్ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సహాయక చర్యలపై పూర్తి వివరాలతో తక్షణమే నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సమాచారం అందుకున్న వెంటనే సీనియర్ మంత్రులు అన్బిల్ మహేశ్ పొయ్యమొళి, మా సుబ్రమణియన్ హుటాహుటిన కరూర్ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులను కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి (Karur Government Medical College Hospital) కి తరలించారు. వీరిలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని, వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

ఆసుపత్రి ప్రాంగణం బాధితులు, వారి బంధువుల ఆర్తనాదాలతో యుద్ధ వాతావరణాన్ని తలపించిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) డేవిడ్సన్ దేవశిర్వతం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ  (Prime Minister Narendra Modi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Karur Stampede

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా (Ex-gratia) ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.

సభా ప్రాంగణంలో ఉన్నట్లుండి జనం ముందుకు

బాధితులను పరామర్శించేందుకు, భవిష్యత్ కార్యక్రమాలకు భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు సీఎం స్టాలిన్ కరూర్ లో పర్యటించనున్నారు.సభా ప్రాంగణంలో ఉన్నట్లుండి జనం ముందుకు తోసుకురావడంతోనే ఈ ఘోరం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భద్రతా వైఫల్యాలు, నిర్వాహకుల లోపాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలి కాలంలో రాజకీయ సభల్లో జరిగిన అతిపెద్ద విషాదాల్లో ఒకటిగా ఈ ఘటన నిలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Home Ministry response karur stampede incident latest news mass gathering accident public safety failure Tamil Nadu tragedy Telugu News TVK party meeting Vijay political rally

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.