తమిళనాడులోని కరూర్ జిల్లాలో నటుడు విజయ్ (Vijay) నిర్వహించిన సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడడం ఆందోళనకు గురిచేసింది.ఈ ఘటనపై ప్రముఖ నటుడు అజిత్ కుమార్ (Ajith) స్పందించాడు.
Read Also: Allu Sirish Engagement : అల్లు శిరీష్ – నయనిక ఎంగేజ్మెంట్
ఈ దారుణమైన విషాదానికి కేవలం ఒక వ్యక్తిని బాధ్యుడిని చేయడం సరికాదని, సమాజంగా మనందరిదీ బాధ్యత అని అన్నాడు. జనాన్ని పోగేసి, తమ బలం చూపించుకోవాలనే ధోరణి సమాజంలో ప్రమాదకరంగా పెరిగిపోయిందని, దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.‘హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్ (Ajith) ఈ అంశంపై మాట్లాడారు.
“తమిళనాడు (Tamil Nadu) లో జరిగిన తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం. ఆ ఘటనకు కేవలం ఆ వ్యక్తి (విజయ్) మాత్రమే బాధ్యుడు కాదు. మనమందరం బాధ్యులమే. ఇందులో మీడియా (Media) పాత్ర కూడా ఉందని నేను భావిస్తున్నాను. ఈ రోజుల్లో జనాన్ని సమీకరించి, గుంపును చూపించుకోవాలనే ఒక రకమైన వ్యామోహంలో మనం కూరుకుపోయాం.
వీటన్నింటికీ ముగింపు పలకాలి
వీటన్నింటికీ ముగింపు పలకాలి” అని అజిత్ స్పష్టం చేశాడు.అభిమానుల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, అయితే వారి ప్రేమ, అభిమానం అదుపులో ఉండాలని అజిత్ సూచించాడు. “సంబరాల పేరుతో అభిమానులు థియేటర్లలో టపాసులు కాల్చడం, స్క్రీన్లు చించేయడం వంటివి చేస్తున్నారు.
ఇలాంటివి ఇకనైనా ఆగాలి. క్రికెట్ మ్యాచ్ చూడటానికి కూడా పెద్ద సంఖ్యలో జనం వెళ్తారు, కానీ అక్కడ ఇలాంటివి జరగవు కదా? కేవలం సినిమా థియేటర్లలో, సినీ ప్రముఖుల దగ్గరే ఎందుకు జరుగుతున్నాయి? దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమకు చెడ్డపేరు వస్తుంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: