Karnataka: (దొడ్డబళ్లాపుర) సాకులు వెతకడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. కానీ, కర్ణాటకలో ఓ మహిళ భర్తకు విడాకులు ఇవ్వడానికి చెప్పిన కారణం విని పోలీసులు సైతం అవాక్కయ్యారు. తన భర్తకు బుల్లెట్ బైక్ నడపడం రాదనే వింత నెపంతో సంసారాన్ని వదిలేసిన ఆమె, ఆపై వరుస పెళ్లిళ్లతో ముగ్గురు వ్యక్తులను బురిడీ కొట్టించింది.
Read Also: AP: పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం
వింత సాకుతో విడాకులు
పోలీసుల వివరాల ప్రకారం.. దొడ్డబళ్లాపుర ప్రాంతానికి చెందిన సుధారాణికి గతంలో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, తన భర్తకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ నడపడం రాదని, అది తనకు ఇష్టం లేదని గొడవ పెట్టుకుంది. ఇదే కారణంతో మొదటి భర్తను, కన్న పిల్లలను వదిలేసి బయటకు వచ్చేసింది. మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత ఆమె అనంతమూర్తి అనే వ్యక్తిని ట్రాప్ చేసి రెండో పెళ్లి చేసుకుంది. కొద్దిరోజులు కాపురం చేసిన తర్వాత అసలు స్వరూపం బయటపెట్టింది. అతని వద్ద నుంచి ఏకంగా రూ. 20 లక్షల నగదును కాజేసి పరారైంది.
మూడో వ్యక్తికి వల.. పోలీసులకు ఫిర్యాదు
అనంతమూర్తిని ముంచిన తర్వాత సుధారాణి చూపు కనకపురకు చెందిన మరో వ్యక్తిపై పడింది. అతడిని కూడా తన మాయమాటలతో లొంగదీసుకునే ప్రయత్నం చేసింది. అయితే, ఆమె మోసాలను గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ముగ్గురు వ్యక్తులను మోసం చేసిన ఈ ‘కిలాడీ లేడీ’పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేవలం బుల్లెట్ బైక్ రాదన్న కారణంతో మొదలైన ఆమె మోసాల పర్వం ఇప్పుడు కటకటాల వరకు చేరింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: