Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు మైనర్లకు సోషల్ మీడియా వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. సాంకేతికత పెరగడం వల్ల పిల్లలు, టీనేజర్లు సోషల్ మీడియాకు బానిసలవుతున్నారని, ఇది వారి భవిష్యత్తుపై, మానసిక స్థితిపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోందని ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
Read Also: Assam: గువాహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్
ఐటీ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే వివరణ.. అంతర్జాతీయ పోకడల దిశగా!
ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సభలో వివరించారు. కేవలం కర్ణాటక మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాయని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే ఆస్ట్రేలియాలో మైనర్లకు సోషల్ మీడియాపై నిషేధం అమలులో ఉండగా, ఫిన్లాండ్ ,యూకే వంటి దేశాలు కూడా ఇదే దిశగా కసరత్తు చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. పిల్లల వ్యక్తిగత భద్రత, డేటా ప్రైవసీని కాపాడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సిద్ధరామయ్య బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది 17వ సారి. తద్వారా కర్ణాటకలో అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన నేతగా ఆయన రికార్డు సృష్టించారు.
నిర్ణయం వెనుక కారణాలు
సోషల్ మీడియాలో పిల్లలు సైబర్ బుల్లీయింగ్, అనుచిత కంటెంట్, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తప్పుదోవ పట్టకుండా చూడటం తన బాధ్యత అని సీఎం స్పష్టం చేశారు. పాఠశాలలు, కళాశాలలను డ్రగ్స్ రహిత మండలాలుగా మార్చడంలో కూడా ఇది సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నిషేధాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై ఐటీ, న్యాయ, విద్యా శాఖలు కలిసి పనిచేస్తాయి. వయస్సు నిర్ధారణ కోసం కఠినమైన నిబంధనలను రూపొందించనున్నారు. అలాగే పాఠశాలల్లో “మొబైల్ వీడండి – పుస్తకం పట్టండి” వంటి అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల పిల్లల విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని విద్యావేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: