📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Karnataka: కర్ణాటకలో కొనసాగుతున్న చిరువ్యాపారుల బంద్

Author Icon By Anusha
Updated: July 23, 2025 • 4:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటకలో జీఎస్టీ అధికారులు తమకు పంపుతున్న నోటీసులకు వ్యతిరేకంగా బేకరీలు, టీ, కాఫీ, పాల విక్రయాలనునిలిపివేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జీఎస్టీ అధికారులు తమను టార్గెట్ చేసుకొనినోటీసులు పంపిస్తున్నారంటే చిరువ్యాపారులు ఆందోళన చేపడుతున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్ల (Digital transactions) ఆధారంగా వ్యాపారులకు జీఎస్టీ నోటీసులు పంపుతున్నది. కర్ణాటకలో దుకాణాదారులు బ్లాక్ బ్యాండ్లను ధరించి నిరసన వ్యక్తంచేస్తున్నారు. మిగతా వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి కానీ.. బేకరీ, చిరు దుకాణాల కౌంటర్లలోనిరసనల ప్రభావం కనిపిస్తోంది. తమ అసమ్మతి తెలియజేసేలా ట్రేడర్లు బ్లాక్ టీ, బ్లాక్ కాఫీని మాత్రమే అమ్ముతున్నారు.జీఎస్టీ విభాగం నోటీసులను వెనక్కి తీసుకోకపోతే తమ ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.2021 నుంచి 2024 ఆర్థిక సంవత్స రాల మధ్య జరిగిన యూపీఐ, డిజిటల్ పేమెంట్స్ ఆధారంగా జీఎస్టీ విభాగం ఈడ్రైవ్ చేపడుతోంది.

Karnataka: కర్ణాటకలో కొనసాగుతున్న చిరువ్యాపారుల బంద్

రూ.40లక్షలు దాటిన వ్యాపారులకు నోటీసులు

దీనికింద ఆన్లైన్ పేమెంట్ల (Online payments) విలువ రూ.20 లక్షల (సర్వీస్), రూ.40 లక్షలు (గూడ్స్) దాటిన వ్యాపారులకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. నాలుగేళ్లలో రూ.1.63 కోట్ల లావాదేవీలు జరిగాయని, రూ.29 లక్షలజీఎస్టీ కట్టాలని తనకు నోటీసు వచ్చిందని హవేరీ ప్రాంతానికి చెందిన కూరగాయల వ్యాపారి శంకర్ గౌడ్ వెల్లడించారు.ఈ డ్రైవ్ చిరు వ్యాపారుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. దాంతో వారు మళ్లీ నగదు విక్రయాల వైపు మొగ్గుచూపుతున్నారు. నో యూపీఐ బోర్డు (UPI Board) లను తమ దుకాణాల ముందుంచుతున్నారు. అలాగే ఈ అంశంపై వ్యాపార సంఘాలుజులై 25వ రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి.బేకరీలు, టీ, కాఫీ, పాల విక్రయాలు బంద్ కావడంతో స్థానికులు పాలు, టీ, కాఫీలకు ఇబ్బంది పడ్డారు. చంటిపిల్లలకు పాలు అందుబాటులో లేకపోవడంతో వారి ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. కూలీపనులు చేసుకునేవారికి కాఫీ,టీలు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కర్ణాటకలో ఎంతో ప్రసిద్ధి పొందినవి ఏమిటి?

కర్ణాటక రాష్ట్రం తన చారిత్రక పర్యటనా ప్రాంతాలు, సంస్కృతి, ప్రకృతి అందాలతో ప్రసిద్ధి చెందింది.

కర్ణాటకకు పూర్వపు పేరేమిటి?

కర్ణాటకకు పూర్వంలో మైసూరు రాష్ట్రం (Mysore State) అనే పేరు ఉండేది. 1973లో “మైసూరు స్టేట్ (ఆల్టరేషన్ ఆఫ్ నేమ్) యాక్ట్” ప్రకారం అధికారికంగా పేరు కర్ణాటకగా మార్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Tea Coffee : కర్ణాటకలో ఈనెల 25న రాష్ట్రవ్యాప్త బంద్‌..చిరు వ్యాపారులు

Bakery Protest Black Band Protest Digital Transactions GST GST Department Karnataka Milk Vendors Notices Small Traders Tax Evasion Tea Stall Protest upi payments

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.