📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Karnataka: సీఎం మార్పుపై క్లారిటీ ఇచ్చిన సిద్దరామయ్య

Author Icon By Saritha
Updated: December 19, 2025 • 2:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై గత కొంతకాలంగా ఉన్న ఉత్కంఠను సిద్దరామయ్య(Siddaramaiah) అణచివేశారు. (Karnataka) అసెంబ్లీ వేదికపై, డీకే శివకుమార్‌తో ఎలాంటి పవర్ షేరింగ్ ఒప్పందం లేదని ఆయన ప్రకటించారు. “నేను పూర్తిగా ఐదేళ్ల పాటు సీఎం గా కొనసాగుతానని” స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా తనకే మద్దతుగా ఉందని సిద్దరామయ్య తెలిపారు. సిద్దరామయ్య మాట్లాడుతూ, గతంలో కూడా నేను పూర్తి ఐదేళ్ల వరకు ముఖ్యమంత్రిగా బాధ్యత వహించాను. ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాను. నా అభిప్రాయం ప్రకారం అధిష్టానం నా పక్షాన ఉంది. పదవిని రెండు భాగాలుగా పంచుకోవాలని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని పేర్కొన్నారు.

Read also: Increased Security : నితీశ్ కుమార్ కు భద్రత పెంపు

Siddaramaiah has given clarity on the change of Chief Minister.

సిద్దరామయ్య-శివకుమార్ మధ్య విభేదాలు

2023లో కాంగ్రెస్(Karnataka) అధికారంలోకి వచ్చిన తర్వాత, సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య ముఖ్యమంత్రిత్వం పంచుకోవడం గురించి ప్రచారం జరిగింది. ఈ ప్రకారం, మధ్యంతర మార్పు జరగవచ్చని డీకే శివకుమార్ వర్గం ఆశించింది. అయితే, సిద్దరామయ్య తాజా వ్యాఖ్యలతో ఆ ఆశలపై నీళ్లు చల్లాయి. గత గురువారం రాత్రి మంత్రి సతీశ్ జార్కిహోళి ఇచ్చిన విందుకు సిద్దరామయ్య, ఆయనకు సన్నిహితులైన కొందరు మంత్రులు హాజరయ్యారు. ఈ విందుకు డీకే శివకుమార్‌కు ఆహ్వానం రాకపోవడం వివాదానికి దారి తీసింది. అయితే, ఈ వివాదంపై శివకుమార్, “విందులో పాల్గొనడంలో ఏమీ తప్పు లేదు” అని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సిద్దరామయ్య, 2028 ఎన్నికల్లో డీకే శివకుమార్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని కొన్ని ఊహాగానాలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Congress Karnataka DK Shivakumar karnataka cm Karnataka politics Latest News in Telugu Power Sharing Deal Siddaramaiah Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.