స్కూళ్లలో కొత్త నిబంధనలు
Karnataka school rules : కర్ణాటకలో పాఠశాలల సాంస్కృతిక కార్యక్రమాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులతో అశ్లీల పాటలపై డ్యాన్సులు చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ వర్తిస్తాయి.
విలువల పరిరక్షణపై దృష్టి
విద్యార్థుల ప్రవర్తన, నైతిక విలువలను కాపాడటంలో పాఠశాలలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. అశ్లీల పాటల వల్ల విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
Read Also ; Bengaluru Crime: తాళం వేసిన ఇంట్లో యువతి నగ్న మృతదేహం.. హత్యేనా?
పాటలు, దుస్తులపై మార్గదర్శకాలు
స్కూల్ కార్యక్రమాల్లో దేశభక్తి, స్ఫూర్తిదాయక గీతాలను మాత్రమే ఎంపిక చేయాలని సూచించింది. విద్యార్థులు హుందాగా ఉండే దుస్తులు ధరించేలా చూసుకోవాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :