📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Karnataka: నేను సీఎం ఎప్పుడు అవుతానో కాలమే చెబుతుంది: శివకుమార్‌

Author Icon By Anusha
Updated: February 7, 2026 • 2:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో తరచూ చర్చకు వస్తున్న నాయకత్వ మార్పు అంశంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరోసారి స్పందించారు. తాను ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతానన్న ప్రశ్నకు సమాధానంగా, అది కాలమే నిర్ణయిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అనవసర ఊహాగానాలు అవసరం లేదని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో జరిగే అన్ని నిర్ణయాలు పార్టీ హైకమాండ్‌ పరిధిలోనే ఉంటాయని స్పష్టం చేశారు. హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తామంతా కట్టుబడి ఉంటామని వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వ పనితీరుపై, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపైనే తమ పూర్తి దృష్టి ఉందని డీకే శివకుమార్ తెలిపారు.

Read Also: Railways: UTS యాప్‌ సేవలు బంద్.. RailOne కి మారాలని కీలక సూచన

Karnataka: Only time will tell when I will become CM: Shivakumar

డీకేకు అవకాశం

గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం ఆయననే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడుతుందని అంతా భావించారు. అయితే, సీఎం సీటు కోసం పోటీపడ్డ సిద్ధరామయ్య వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గుచూపింది. డీకే, సిద్ధరామయ్యలతో చర్చలు జరిపి వివాదం రేగకుండా సర్దిచెప్పింది. అప్పట్లో సీఎం సీటును డీకే, సిద్ధూ చెరో రెండున్నర సంవత్సరాలు పంచుకుంటారని, తొలుత సీఎం కుర్చీలో కూర్చున్న సిద్ధరామయ్య ఆ తర్వాత డీకేకు అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

DK Shivakumar Karnataka politics latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.