📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Karnataka: ఇక! వేతనంతో కూడిన నెలసరి సెలవులు

Author Icon By Anusha
Updated: November 13, 2025 • 4:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహిళలకు పీరియడ్స్ (Periods) అనేది ప్రతి నెల సహజమైన శరీర ప్రక్రియ. కానీ ఆ సమయంలో వారు అనుభవించే శారీరక, మానసిక ఒత్తిడి అంత సులభం కాదు. కడుపు నొప్పి, తలనొప్పి, అలసట, ఒత్తిడి వంటి సమస్యలతో వారు బాగా ఇబ్బంది పడతారు. ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

Read Also: Delhi Blast: రూమ్ నెంబర్ 13 లో డాక్టర్లు ప్రణాళికలు

ఇకపై కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో పనిచేసే మహిళా ఉద్యోగులకు ప్రతి నెల ఒక రోజు “పీరియడ్ లీవ్” ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 12న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.ప్రతి మహిళకు సంవత్సరానికి 12 రోజుల వేతనంతో కూడిన ప్రత్యేక సెలవులు లభిస్తాయి.మహిళా ఉద్యోగుల (female employees) సంక్షేమం కోసం తీసుకున్న ఒక చారిత్రక నిర్ణయమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

18 నుంచి 52 ఏళ్ల మధ్య వయసు ఉన్న అందరు మహిళా ఉద్యోగులు

కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో 18 నుంచి 52 ఏళ్ల మధ్య వయసు ఉన్న అందరు మహిళా ఉద్యోగులు (పర్మినెంట్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు) నెలకు ఒకటి చొప్పున.. ఏడాదికి 12 రోజులు వేతనంతో కూడిన సెలవులను అందించనున్నారు. ఈ ఉత్తర్వులు ఫ్యాక్టరీస్ చట్టం, షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం (ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు), ప్లాంటేషన్ వర్కర్స్ చట్టం వంటి వాటి పరిధిలోకి వచ్చే అన్ని సంస్థలకు వర్తిస్తాయని కర్ణాటక ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

ఇక ఈ నెలసరి సెలవును ఏ నెలకు సంబంధించి ఆ నెలలోనే మహిళా ఉద్యోగులు ఉపయోగించుకోవాలని.. వాటిని తర్వాత నెలకు బదిలీ చేయడానికి వీలు లేదని కర్ణాటక ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సెలవును తీసుకోవడానికి వారు ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో స్పష్టం చేశారు. కర్ణాటకలోని మహిళా ఉద్యోగుల ఆరోగ్య, మానసిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని.. వారికి ఈ నెలసరి సెలవు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Karnataka Government latest news Menstrual Leave Period Leave Policy Telugu News Women Employees

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.