కర్ణాటక (Karnataka) లోని బాగల్‌కోట్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. రూప అనే మహిళ తన ముగ్గురు పసిపిల్లలను ఉరేసి చంపి, అనంతరం తానే డీజిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడింది. భర్త స్థానికుల సాయంతో ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా పిల్లలు అప్పటికే చనిపోయి కనిపించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రూపను ఆసుపత్రికి తరలించారు. అత్తింటి వేధింపుల వల్లే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Rangareddy News: వీధి కుక్కల బీభత్సం.. చిన్నారికి తీవ్ర గాయాలు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: