Latest News:  Karnataka: ఐదేళ్లు నేనే సీఎంగా ఉంటా : సీఎం సిద్ధరామయ్య

Read Time:  1 min
Karnataka
Karnataka
FONT SIZE
GET APP

కర్ణాటక రాజకీయాల్లో ఒక కొత్త చర్చ ప్రారంభమైంది. ముఖ్యంగా డీకే శివకుమార్ అనుచరులు, ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. కుణిగల్ ఎమ్మెల్యే సహా పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు డీకే శివకుమార్ (DK Sivakumar) ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని పునరావృతంగా డిమాండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపధ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Chief Minister Siddaramaiah) కీలక వ్యాఖ్యలు చేశారు.

Bharat Bandh : భారత్ బంద్ పై కీలక ప్రకటన

పలువురు పార్టీ నేతలు డిమాండ్ చేయడంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రి (CM) గా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.”నేను పూర్తి కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతాను.

Karnataka
Karnataka

దసరా ఉత్సవాల్లో పుష్పార్చన చేస్తాననే నమ్మకం

వచ్చే ఏడాది మైసూరు దసరా ఉత్సవాల్లో పుష్పార్చన చేస్తాననే నమ్మకం కూడా ఉంది. అయితే, పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాను” అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.అంతకుముందు కుణిగల్ ఎమ్మెల్యే రంగనాథ్ (MLA Ranganath) మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి డీకే శివకుమార్ చేసిన కృషిని పార్టీ అధిష్ఠానం గుర్తించాలని కోరారు.

డీకే శివకుమార్ తన రాజకీయ గురువు అని, ఆయన సామాజిక సేవతో పాటు పాలనలోనూ తనదైన ముద్ర వేశారని అన్నారు. రాష్ట్ర పాలనా పగ్గాలను డీకేఎస్‌కు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ఓటర్లు కూడా ఇదే కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ దిశగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.