(Karnataka) బెంగళూరులో జరిగిన పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ఈ పదవిని శాశ్వతంగా నేను చేపట్టలేను… ఇప్పటికే ఐదున్నరేళ్లు అయ్యింది.. వచ్చే మార్చి నాటికి ఆరేళ్లు పూర్తవుతుంది’ అని వ్యాఖ్యానించారు. అనంతరం తన అనుచరులను డీకే (DK Sivakumar) ధైర్యపరుస్తూ.. తాను రాష్ట్ర నాయకత్వ బృందంలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ‘ఆందోళన చెందవద్దు.. నేను ముందువరుసలోనే ఉంటాను’ అని ఆయన అన్నారు.
Read Also: Donald Trump Jr: భారత పర్యటనకు ట్రంప్ కుమారుడు.. ఎప్పుడంటే?

మరొకరికి అవకాశం ఇవ్వాలి
ఇతరులకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. ‘డిప్యూటీ CM అయినప్పుడే PCC చీఫ్ పదవికి రాజీనామా చేద్దామని అనుకున్నా. కానీ కొనసాగమని రాహుల్, ఖర్గే చెప్పారు. నా డ్యూటీ నేను చేశా’ అని తెలిపారు. ఇక్కడ ఎవ్వరూ శాశ్వతంగా ఉండలేరని తెలిపారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమం తర్వాత శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ… ‘ఎవరూ శాశ్వతంగా పదవిలో కొనసాగలేరు’ అంటూ తాను ఒక ఉదాహరణగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. కాగా, మంగళవారం డీకే ఇంకో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రులు కావాలనే ఎమ్మెల్యేల ఆశయాలపై ‘కష్టపడి పనిచేసే వారికి ఆకాంక్షలు ఉంటాయి. అది తప్పు అని మనం చెప్పగలమా?’ అని అన్నారు. నాయకత్వ మార్పుపై,‘జ్యోతిష్యుడిని సంప్రదించండి…’ అని చమత్కరించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: