ఒకవైపు ఉన్నతమైన చదువులకోసం, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి.. అక్కడే సెటిల్ పోతున్న వారెందరో ఉన్నారు. అక్కడే నచ్చిన భాగస్వాములను ఎంపిక చేసుకుని, తల్లిదండ్రుల సమక్షంలో ఒక్కటైపోతున్న జంటలకు కూడా కొదువ లేదు. వారికి కులం, మతం, దేశాలు, ప్రాంతీయ, సరిహద్దులు బేధాలు లేవు. మనసుకు నచ్చితే కలిసి జీవించేందుకు పెళ్లి చేసుకుంటున్నారు. అందుకు తల్లిదండ్రులు, బంధువులు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పడం లేదు. కానీ ఇక్కడివారిలో కొందరికి ఇంకా కులం, మతం, భాష, ప్రాంతీయ బేధాలు ఉన్నాయి. పరువు కోసం కన్నవారిని హతమార్చేందుకు వెనుకాడడం లేదు. తాజాగా కర్ణాటకలో కుల దురహంకారం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. (Karnataka) గర్భిణి అని కూడా చూడకుండా కన్నకూతురినే తంనండి దారుణంగా కొట్టి చంపిన హృదయవిదారక ఘటన హుబ్బళ్లిలో చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆరునెలల గర్భిణి (Pregnant woman) అయిన సొంత కూతురిని తండ్రి, బంధువులు కలిసి దారుణంగా హత్య చేశారు.
Read Also: Bangladesh: మారణహోమాన్ని ఆపడానికే భారత్ కు వచ్చాను.. షేక్ హసీనా
కులాంతర వివాహమే శాపమైందా?
మృతురాలు మాన్య పాటిల్ (19) అదే గ్రామానికి చెందిన వేరే కులం యువకుడిని ఈ ఏడాదిలో మే నెలలో ప్రేమించి పెళ్లి చేసుకుది. (Karnataka) వీరి వివాహం మాన్య తండ్రి ప్రకాష్ కు అస్సలు ఇష్టం లేదు. పెళ్లి తర్వాత తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందని భయపడిన మాన్య.. భర్తతో కలిసి సుమారు వందకిలోమీటర్ల దూరంలో ఉన్న హవేరి జిల్లాలో నివసించేది. చాలాకాలం దూరంగా ఉన్న మాన్య దంపతులు.. ఇటీవల డిసెంబర్ 8న తమ స్వగ్రామానికి తిరిగి వచ్చారు. వీరి రాకను గమనించిన మాన్య తండ్రి ప్రకాష్, ఇతర బంధువులు ఆమెపై కక్షపెంచుకున్నారు.
విచక్షణారహితంగా కొట్టి చంపిన తండ్రి
ఆదివారం మధ్యాహ్నం మాన్య భర్త, మామ పొలంలో ఉండగా నిందితులు వారిపై దాడికి ప్రయత్నించారు. అయితే వారు అక్కడి నుంచి తప్పించుకున్నారు. సాయంత్రం 6గంటల సమయంలో నిందితులు ఇనుప పైపులతో మాన్య అత్తగారి ఇంట్లోకి చొరబడ్డారు. ఆరు నెలల గర్భిణి అయిన మాన్యను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కొట్టారు. ఆమెను కాపాడబోయిన మాన్య అత్త రేణుకను, మామ సుభాష్ లను కూడా నిందితులు తీవ్రంగా గాయపరిచారు. తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రికి తరలించగా.. మాన్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అత్తమామలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసులు అదుపులో నిందితులు
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మాన్య తంనరడి ప్రకాష్ సహా ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పుట్టబోయే బిడ్డతో సహా కూతురిని హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com