📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం

Author Icon By Sudheer
Updated: January 22, 2025 • 8:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర జలగావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పరండా రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక ఎక్స్ ప్రెస్ ట్రైన్ వేగంగా వచ్చి పలువురు ప్రయాణికులను ఢీకొట్టడంతో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి ముందుగా పుష్పక్ ఎక్స్ ప్రెస్ ట్రైన్‌లో మంటలు చెలరేగాయన్న వదంతులతో ప్రయాణికులు భయంతో చైన్ లాగి ట్రైన్‌ను ఆపించారు. ఆందోళనతో ట్రైన్ నుంచి దిగిన ప్రయాణికులు పట్టాలు దాటే ప్రయత్నం చేస్తుండగా మరో ట్రాక్‌పై వేగంగా వచ్చిన కర్ణాటక ఎక్స్ ప్రెస్ వారిని ఢీకొట్టింది.

ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టడం ప్రారంభించి, గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు కూడా చేరుకున్నారు. ఈ ఘటన రైల్వే భద్రతపై అనేక ప్రశ్నలను రేకెత్తించింది. ట్రైన్‌లలో భద్రతా చర్యలు తగిన విధంగా అమలులో లేకపోవడం, ప్రయాణికుల జాగ్రత్తలపై అవగాహన లేకపోవడం వంటి అంశాలు ఈ దుర్ఘటనకు కారణమై ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, రైల్వే శాఖ ఘటనపై దర్యాప్తు చేపట్టింది. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని రకాల భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరముందని అధికారులు పేర్కొన్నారు.

10 killed Google news Jalgaon Train Tragedy Karnataka Express Karnataka Express Hits Passengers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.