📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Dharmasthala News : ధర్మస్థల తవ్వకాలో కీలక మలుపు..

Author Icon By Sai Kiran
Updated: August 13, 2025 • 3:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని ధర్మస్థల ఉదంతం రోజుకో మలుపు తిరుగుతున్నది. దేశంలోనే సంచలన కేసుగా మారిన ఈ ఉదంతం పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
కొన్ని సంవత్సరాలుగా ఆడపిల్లలు, బాలికల పట్ల అత్యంత క్రూరంగా అత్యాచారం చేస్తూ, హతమారుస్తున్న వైనం యావత్ దేశాన్నే కదిలిస్తోన్న ఘోర ఘటన ఇది. డబ్బు, అధికారం,
సమాజంలో తమకున్న పేరుబలంతో ఏం చేసినా పర్వాలేదు అనుకుంటూ, అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న ధర్మస్థల(dharmasthala news) నిందితులు ఇక తప్పించుకోలేరు. త్వరలోనే వారంతా
న్యాయస్థానం ముందు నిలబడే రోజు వస్తుంది. డ్రోన్ ఆధారిత జీపీఆర్ టెక్నాలజీతో వర్షంలో అన్వేషణ కొనసాగుతున్నది. మాజీ పారిశుద్ధ కార్మికుడు భీమా చూపిన ప్రదేశాల్లో నేత్రావతి నది పరివాహకంలో కీలకమైన 13వ నెంబర్ సైట్ వద్ద పరిశోధన తవ్వకాలు కొనసాగిస్తున్నారు. భూమిలోపల మృతదేహాల అవశేషాలు గుర్తించేందుకు జిపిఆర్(GPR) గ్రౌండ్ పెనట్రేటింగ్ రేడార్ని దించింది ప్రత్యేక దర్యాప్తు బృందం. జీపీఆర్తో భూమిలోకి సిగ్నల్స్ పంపి సెన్సర్ల ద్వారా వచ్చే డేట రికార్డ్ చేయనుంది. నదీపరివాహక ప్రాంతంలో
భూమిలోపల ఉన్న ఎలాంటి వస్తువైనా ఈ టెట్నాలజీ గుర్తిస్తోంది.

13వ సైట్లో 8 మృతదేహాలు ఖననం

కాగా విజిల్బ్లోయర్ వాంగ్మూలంతో జిపిఆర్ వినియోగంతో ధర్మస్థలంలో(dharmasthala news) సంచలనాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బాహుబలి విగ్రహం ఉన్న రత్నగిరి బెట్టకు 200 మీటర్ల దూరంలో వర్షంలోనే తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అయితే రత్నగిరిబెట్ట సమీపం ప్రాంతాల్లో ఎక్కడి నుంచో తెచ్చి కొత్తగా మట్టి పోసినట్లు
గుర్తించింది సిట్. కొత్తగా మట్టి పోయించాల్సిన అవసరం ఏమిటనం తహశీల్దారుకు సిట్ నోటీసులు ఇచ్చింది. మట్టి పోసిన విషయం తమకు తెలియదని అధికారులు చెప్పటంతో
అనుమానాలను వ్యక్తం చేస్తోంది సిట్.

ఆత్మీయుల కుటుంబాల్లో పెరుగుతున్న ఉత్కంఠ

కాగా అదృశ్యమైన ఆత్మీయుల కుటుంబాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. కనీసం అయినవాళ్లయినా దొరుకుతాయేమోనని చిన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 38 ఏళ్లక్రితం జరిగిన ఓ విద్యార్థిని హత్యపై పునర్విచారణ కోరుతూ సిట్ని ఆశ్రయించింది ఆమె సోదరి. 1995 నుంచి 2014 మధ్య వందల సంఖ్యలో మహిళలు, విద్యార్థినుల మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశానని అప్పట్లో శానిటేషన్ కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి జూన్ 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజిల్ బ్లోయర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు తవ్వకాలు చేపట్టారు. ఇప్పటిదాకా 16 వేర్వేరు ప్రదేశాల్లో తవ్వకాలు జరిగాయి.

Breaking News in Telugu burriel case darmasthali case Dharmasthala Dharmasthala News Google News in Telugu Karnataka karnataka burriel case Latest News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.